నవ్వుల్‌.. నవ్వుల్‌.!

టీచర్‌: బంటీ.. నువ్వు లెక్కలు సరిగ్గా చేయడం లేదని, ఇంపోజిషన్‌ ఇచ్చాను కదా.. రాశావా?

Published : 13 Sep 2023 00:02 IST

భలే భలే..

టీచర్‌: బంటీ.. నువ్వు లెక్కలు సరిగ్గా చేయడం లేదని, ఇంపోజిషన్‌ ఇచ్చాను కదా.. రాశావా?

బంటి: రాశాను టీచర్‌.. ఇదిగోండి..

టీచర్‌: అదేంటి.. పదిసార్లని చెబితే ఆరుసార్లే రాసుకొచ్చావు..?

బంటి: అంటే.. నేను లెక్కల్లో వీక్‌ కదా టీచర్‌..

టీచర్‌: ఆఁ.!


నిజమే కదా..!

కిట్టు: చంటీ.. అన్నింటికంటే ఆనందంగా ఉండే జంతువు ఏది?

చంటి: ఏనుగు..

కిట్టు: అలా ఎలా చెప్పగలవు..?

చంటి: అవెప్పుడూ దంతాలు బయటకు కనిపించేలా నవ్వుతూనే ఉంటాయి కదా కిట్టూ..

కిట్టు: ఆఁ..!


అలా అర్థమైందా..?

మావయ్య: ఏంట్రా టింకూ.. వీధి చివరనున్న కళ్ల డాక్టర్‌ దగ్గరకు వెళ్తానంటున్నావు?

టింకు: మొన్న ఆ డాక్టర్‌ ఇచ్చిన కళ్లద్దాలతో తాతయ్య బాగా చదవగలుగుతున్నాడట..

మావయ్య: ఆ అయితే..?

టింకు: నేను కూడా అవి తెచ్చుకుంటే, బడికెళ్లే బాధ ఉండదు కదా మావయ్యా..

మావయ్య: ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని