నవ్వుల్‌.. నవ్వుల్‌..!

అంతేగా..! చిన్ని: బన్నీ.. మీ అన్నయ్యకు ఇప్పుడు ఎన్నేళ్లు..? బన్ని: ఎనిమిదేళ్లు చిన్నీ..

Published : 15 Sep 2023 00:17 IST

అంతేగా..!
చిన్ని: బన్నీ.. మీ అన్నయ్యకు ఇప్పుడు ఎన్నేళ్లు..?
బన్ని: ఎనిమిదేళ్లు చిన్నీ..
చిన్ని: నేను అడిగింది నీ వయసు కాదు.. మీ అన్నయ్యది..!!

బన్ని: అదేమరి.. నేను పుట్టాకే కదా తను అన్నయ్య అయ్యింది..
చిన్ని: ఆఁ..!


అదే తెలుసు మరి..  

టీచర్‌: చింటూ.. అస్సాం రాష్ట్రంలో ఎక్కువగా ఏం పండిస్తారు?
చింటు: తెలియదు టీచర్‌..
టీచర్‌: నువ్వు ఉదయాన్నే తాగే టీలో టీపొడి ఎలా వస్తుంది..?

చింటు: మా పక్కింటి నుంచి టీచర్‌..
టీచర్‌: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని