నవ్వుల్‌.. నవ్వుల్‌.!

బంటి: చంటీ.. మన కాలనీలో స్విమ్మింగ్‌ పూల్‌ ఏర్పాటు చేయడానికి నువ్వు కూడా కొంత సాయం చేయాలి..

Published : 16 Sep 2023 00:35 IST


తనవంతు సాయం..!

బంటి: చంటీ.. మన కాలనీలో స్విమ్మింగ్‌ పూల్‌ ఏర్పాటు చేయడానికి నువ్వు కూడా కొంత సాయం చేయాలి..
చంటి: అలాగే బంటీ.. తప్పకుండా.. ఇంటికి వెళ్లి వస్తాను.. ఇక్కడే ఉండు మరి..
బంటి: తప్పకుండా సాయం చేస్తానని, గ్లాసులో నీళ్లు తెచ్చావేంటి..?

చంటి: స్విమ్మింగ్‌ పూల్‌కి కావాల్సింది నీళ్లే కదా బంటీ..!
బంటి: ఆఁ..!


అలా అర్థమైందా..!

టీచర్‌: ఏంటి కిట్టూ.. పట్టపగలే టార్చిలైట్‌ వెలిగించావు?
కిట్టు: మీరే కదా.. చదవకపోతే, జీవితం చీకటవుతుందన్నారు..  
టీచర్‌: ఆ అయితే..?

కిట్టు:  నాకు చీకటంటే చాలా భయం.. అందుకే ముందు జాగ్రత్తగా టార్చిలైట్‌ని ఆన్‌ చేసి పెట్టాను టీచర్‌..  
టీచర్‌: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని