నవ్వుల్‌.. నవ్వుల్‌..!

Published : 21 Sep 2023 01:49 IST

అంతే టీచర్‌..!

టీచర్‌: పిల్లలూ.. నేనో ప్రశ్న అడుగుతాను. మీరంతా సమాధానం చెప్పాలి..

విద్యార్థులు: అలాగే టీచర్‌..!

టీచర్‌: లైన్‌ అంటే ఏంటో చెప్పండి.

విద్యార్థులు: ఒక బిందువు (చుక్క) నడుచుకుంటూ వెళ్లడాన్నే లైన్‌ అంటారు టీచర్‌..

టీచర్‌: ఆఁ..!

మొదటి ప్రశ్న..!

టీచర్‌: పిల్లలూ.. ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నకు మొదటగా జవాబు చెప్పిన వాళ్లు ఇంటికెళ్లొచ్చు..

విద్యార్థులు: అలాగే టీచర్‌..

టీచర్‌: అలాగేనంటూ.. బ్యాగ్‌ వేసుకొని ఎక్కడికి బయలుదేరావు బంటీ..?

బంటి: నేనిలా చేస్తేనే కదా టీచర్‌.. మీరు ‘బ్యాగ్‌ వేసుకొని ఎక్కడికి బయలుదేరావు బంటీ..?’ అని ప్రశ్న అడిగారు..  

టీచర్‌: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని