నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: పిల్లలూ.. అందరూ కుక్క గురించి వ్యాసం రాయండి.

Published : 24 Sep 2023 00:20 IST

కుక్క ఒకటే.!

టీచర్‌: పిల్లలూ.. అందరూ కుక్క గురించి వ్యాసం రాయండి.

విద్యార్థులు: అలాగే టీచర్‌..

టీచర్‌: ఇదేంటి.. అందరూ ఒకేలా రాశారు..?

బంటి: అంటే.. మేమంతా ఒకే కుక్క గురించి రాశాం టీచర్‌..  


అంతే కదా..!

కిట్టు: భూమికంటూ ఒక ఆకారం ఉందని ఎలా చెప్పగలవు చింటూ..!

చింటు: ఇదే ప్రశ్న పరీక్షల్లో అడిగిన ప్రతిసారీ.. నేను త్రిభుజం, చతురస్రం ఆకారాలు గీశాను..!

కిట్టు: హా.. అయితే..!

చింటు: అప్పుడు మా టీచర్‌.. సమాధానం దగ్గర సున్నా చుట్టారు.. అంటే భూమి గుండ్రంగా ఉన్నట్టే కదా..!

కిట్టు: ఆఁ..!


సరిపోయారు..!!

పింకి : టీచర్‌.. నిన్న మీ క్లాసులో లిల్లీ నిద్రపోయింది..

టీచర్‌: మరి నిన్ననే ఎందుకు చెప్పలేదు?

పింకి : అప్పుడు నేను నిద్రపోతున్నా టీచర్‌..

టీచర్‌: ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని