నవ్వుల్‌..నవ్వుల్‌..!

టీచర్‌: పిల్లలూ.. అందరూ రింగ్‌ బొమ్మ గీసి చూపించండి.

Published : 29 Sep 2023 00:24 IST

మీరు చెప్పలేదు కదా..!

టీచర్‌: పిల్లలూ.. అందరూ రింగ్‌ బొమ్మ గీసి చూపించండి.

విద్యార్థులు: అలాగే టీచర్‌..

టీచర్‌: అదేంటి బంటీ.. రింగ్‌ గీయమంటే చతురస్రం గీశావు?

బంటి: అంటే టీచర్‌.. మీరు ఏ రింగ్‌ గీయాలో చెప్పలేదు కదా.. అందుకే బాక్సింగ్‌ రింగ్‌ గీశా..!

టీచర్‌: ఆఁ..!

హిస్టరీ కదా..!

కిట్టు: ఏంటి చింటూ.. నీ పుస్తకం ఇంత పాతగా ఉంది?

చింటు: అది హిస్టరీ పుస్తకం కదా కిట్టూ.. అందుకే..

కిట్టు: అయితే పాతగా ఉంటుందా?

చింటు: అంటే అందులో అన్నీ పాత విషయాలే ఉంటాయి కదా..!

కిట్టు: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని