నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: పిల్లలూ.. నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెబుతారా?

Published : 01 Oct 2023 00:06 IST

నిజమే మరి!

టీచర్‌: పిల్లలూ.. నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెబుతారా?

విద్యార్థులు: చెబుతాం టీచర్‌..

టీచర్‌: మొదటి ప్రపంచ యుద్ధం ఎక్కడ జరిగింది పిల్లలూ?

విద్యార్థులు: చరిత్ర పుస్తకంలో టీచర్‌..

టీచర్‌: ఆఁ..!


ఎవరో ఎందుకు..?

కిట్టు: ఏంటి బంటీ.. అలా గిన్నె పక్కన కూర్చున్నావు?

బంటి: మరేం లేదు కిట్టూ.. మా అమ్మ పెరుగుకు తోడు తెమ్మంది. ఎవరినో ఎందుకు తీసుకురావడమని నేనే పాల గిన్నె పక్కన తోడుగా కూర్చున్నా..

కిట్టు: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని