నవ్వుల్‌.. నవ్వుల్‌..!

Published : 03 Oct 2023 00:07 IST

ఎన్నిసార్లో చెప్పలేదు..!

టీచర్‌: ఏంటి కిట్టూ.. ఎంత చెప్పినా ‘సైకాలజీ’ స్పెల్లింగ్‌ తప్పుగానే రాస్తున్నావు?  

కిట్టు: మర్చిపోతున్నా టీచర్‌..

టీచర్‌: అయితే.. రెండు పేజీల్లో ఇంపోజిషన్‌ రాసుకొని రా..!

కిట్టు: అలాగే టీచర్‌..

టీచర్‌: పెద్ద అక్షరాలతో పదాన్ని ఒకేసారి రాసేసి, రెండు పేజీలు నింపేశావేంటి?

కిట్టు: అంటే ఎన్నిసార్లు రాయాలో మీరు చెప్పలేదు కదా టీచర్‌..!

అంతా న్యూటన్‌ వల్లే!

చింటు: ఏంటి.. బంటీ.. ఏదో సీరియస్‌గా ఆలోచిస్తున్నావు?

బంటి: న్యూటన్‌ గురించి!

చింటు: న్యూటన్‌ గురించా?

బంటి: అవును చింటూ... చెట్టు పై నుంచి ఆపిల్‌ పడితే.. హాయిగా తిని ఊరుకుంటే సరిపోయేది. సిద్ధాంతాలని రాద్ధాంతాలు చేశాడు. ఇప్పుడు మనం అవన్నీ చదవలేక ఇబ్బంది పడుతున్నాం.

చింటు: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని