నవ్వుల్‌..నవ్వుల్‌..!

బంటి: చంటీ.. నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కబడ్డీ ఆటలో ఓడిపోలేదు తెలుసా..?

Published : 06 Oct 2023 00:05 IST

అంతే కదా..!

బంటి: చంటీ.. నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కబడ్డీ ఆటలో ఓడిపోలేదు తెలుసా..?

చంటి: నీకు అంత బాగా ఆడటం వచ్చా..!?

బంటి: లేదు, నాకు అసలు రాదు..

చంటి: మరి ఎప్పుడూ ఓడిపోలేదన్నావు?

బంటి: అసలు ఆడితేనే కదా.. ఓడిపోయేది..!

చంటి: ఆఁ..!

మీరే చెప్పారు..!

టీచర్‌: ఏంటి పిల్లలూ.. అందరూ సైలెంట్‌గా ఉన్నారు?

కిట్టు: మౌనం పాటిస్తున్నాం టీచర్‌..

టీచర్‌: ఎందుకు కిట్టూ..?

కిట్టు: చింటూ వాళ్ల ఇంట్లో ఎలుక చచ్చిపోయింది.. మీరే చెప్పారు కదా టీచర్‌.. ఎవరైనా చనిపోతే మౌనం పాటించాలని..

టీచర్‌: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని