నవ్వుల్‌.. నవ్వుల్‌..!

చంటి: నేనో ప్రశ్న అడుగుతాను.. సమాధానం చెబుతావా?

Updated : 21 Oct 2023 05:09 IST

అది నేనే..!

చంటి: నేనో ప్రశ్న అడుగుతాను.. సమాధానం చెబుతావా?

చింటు: చెబుతాను చంటీ..

చంటి: ఎనిమిదేళ్ల క్రితం లేనిది, ఇప్పుడు ప్రత్యేకమైనదేంటి?

చింటు: నేనే..!

చంటి: అర్థం కాలేదు చింటూ..

చింటు: నేను పుట్టింది అప్పుడే కదా..!

నీ గోల్‌ ఏంటి..?

టీచర్‌: ఇంతకీ.. నీ గోల్‌ ఏంటి కిట్టూ..!

కిట్టు: ఎలాగైనా గణితం పరీక్ష పాసవ్వాలి టీచర్‌..

టీచర్‌: పరీక్షల గురించి కాదు కిట్టూ.. నీ గోల్‌ ఏంటి అని అడిగాను..

కిట్టు: నేను చెప్పింది కూడా నా గోల్‌ గురించే టీచర్‌..!

టీచర్‌: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని