నవ్వుల్‌.. నవ్వుల్‌..!

Published : 04 Nov 2023 01:04 IST

టీచర్‌ని ఫాలో అయ్యా!

అమ్మ: చిన్నీ.. నీ నోట్‌బుక్‌ అంతా ఖాళీగా ఉందేంటి.. ఏం రాయలేదా?

చిన్ని: రాశానమ్మా..!

అమ్మ: మరేం కనిపించట్లేదు?

చిన్ని: మా టీచర్‌ తనని ఫాలో అవ్వమని చెప్పారు.. బోర్డు మీద రాసేసి, మళ్లీ తుడిపేసేవారు. నేనూ అలాగే నా బుక్‌లో పెన్సిల్‌తో రాసి తుడిపేశానమ్మా..  

అమ్మ: ఆఁ..!

బ్యాడ్‌గా గడిచింది..!

చింటు: బంటీ.. ఎందుకలా ఏడుస్తున్నావు?

బంటి: ఈరోజు నేను గుడ్‌-డే బిస్కెట్లు తిన్నాను..

చింటు: అయితే..?

బంటి: అయినా.. ఈరోజు నాకు గుడ్‌ ఏం జరగలేదు.. అనవసరంగా మా అమ్మతో దెబ్బలు తిన్నా..  

చింటు: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని