నవ్వుల్‌.. నవ్వుల్‌..!

అమ్మ: చిన్నీ.. ఏం చేస్తున్నావు?

Published : 05 Nov 2023 00:08 IST

వంక దొరికింది..!

అమ్మ: చిన్నీ.. ఏం చేస్తున్నావు?

చిన్ని: చదువుకుంటున్నానమ్మా..!

అమ్మ: వెరీగుడ్‌.. ఇలానే చదివితే భవిష్యత్తులో విదేశాలకు వెళ్లి పెద్ద ఉద్యోగం చేయొచ్చు..

చిన్ని: అమ్మో.. అయితే ఇప్పటి నుంచి నేను చదవనమ్మా..

అమ్మ: ఏం.. ఎందుకు?

చిన్ని: నాకు విదేశాలకు వెళ్లడం ఇష్టం లేదమ్మా..!


దిద్దలేదు.. సరిదిద్దానంతే!

బంటి: చింటూ.. నీ ప్రోగ్రెస్‌ కార్డు చూపించు..

చింటు: ఇదిగో బంటీ..!

బంటి: ఏంటి.. మార్కులు దిద్దినట్లుగా ఉన్నాయి?

చింటు: తప్పు చేస్తే సరిదిద్దుకోవాలని మా అమ్మ చెబుతుంటుంది. అందుకే, మా టీచర్‌ చేసిన పొరపాటును సరిదిద్దా..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని