నవ్వుల్‌.. నవ్వుల్‌..!

Published : 08 Nov 2023 00:07 IST

వంద మార్కులు..`

చిన్ని: అమ్మా.. నీకో విషయం చెప్పనా..?

అమ్మ: చెప్పు చిన్నీ..

చిన్ని: నాకు ఇంగ్లిష్‌లో 95 మార్కులొచ్చాయి..

అమ్మ: మరి మిగిలిన అయిదు ఏమయ్యాయి?

చిన్ని: ఎక్కడికీ పోలేదమ్మా.. గణితంలో వచ్చాయిగా..!

అమ్మ: ఆఁ..!

డాక్టర్‌ చెప్పారు..!

బంటి: చింటూ.. ఏంటి నేను వచ్చిన ప్రతిసారీ కళ్లజోడు పెట్టుకుంటున్నావు?

చింటు: మరేం లేదు బంటీ.. డాక్టర్‌ తలనొప్పి వచ్చినప్పుడల్లా కళ్లజోడు పెట్టుకోమన్నారు లే..

బంటి: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని