నవ్వుల్‌.. నవ్వుల్‌..!

నాన్న చెబుతారు..!

Updated : 21 Nov 2023 03:44 IST

నాన్న చెబుతారు..!

బిట్టు: నాకో సందేహం కిట్టూ.. అడగనా?

కిట్టు: అడుగు..!

బిట్టు: ఎప్పుడు చూసినా క్లాస్‌ అయ్యేటప్పుడు టీచర్‌ని అడిగి మరీ.. బయటే నిల్చుంటావేంటి?

కిట్టు: మా నాన్న ఎప్పుడూ ‘అవుట్‌ స్టాండింగ్‌ స్టూడెంట్’ అవ్వాలని చెబుతుంటారు బిట్టూ.. అందుకే..!

దటీజ్‌ చిన్నీ!

అమ్మ: చిన్నీ.. ఎందుకలా ఏడుస్తున్నావు?

చిన్ని: స్కూల్‌ నుంచి వస్తుంటే కింద పడిపోయానమ్మా కాలికి దెబ్బ తగిలింది.

అమ్మ: అయితే ఉండు ఏదైనా పెడతాను..

చిన్ని: నేను పెట్టేశానమ్మా..!

అమ్మ: ఏం పెట్టావు కనిపించట్లేదే?

చిన్ని: ఫొటో తీసి వాట్సాప్‌లో స్టేటస్‌ పెట్టానమ్మా..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని