మీ టూత్‌బ్రష్‌లో కాగితం ఉందా?!
పళ్లు తోముకోవాలి అంటే.. బ్రష్షూ, పేస్టూ ఉండాలి.. ఇవి రెండూ లేకపోతే.. పళ్లపొడి అయినా ఉండాలి.. ఈ మూడూ లేవు అనుకోండి! అప్పుడు కనీసం వేపపుల్లలాంటిదైనా ఉండాలి.. కానీ ఓ అక్కయ్య.. ‘ఇవేమీ అక్కర్లేదు.. ఎంచక్కా కాగితంతో పళ్లు తోముకోవచ్చు’ అంటోంది. ‘కాగితంతోనా?.. అదెలా సాధ్యమబ్బా?’ అనే అనుమానం మీకీపాటికే వచ్చేసి ఉంటుంది కదూ! అయితే ఈ కథనం చదివేయండి మీకే తెలుస్తుంది.
ధ్రువీ గుప్తా.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ అక్క పేపర్ టూత్‌బ్రష్‌ను ఆవిష్కరించింది. ఇది చాలా చిన్నగా, తేలిగ్గా ఉంటుంది. జేబు, పర్స్, హ్యాండ్‌బ్యాగ్‌లో అయినా పెట్టేసుకోవచ్చు. వాడటం చూడా చాలా తేలిక.
వేలికి చుట్టుకుని!
ఈ పేపర్ టూత్‌బ్రష్‌ను వేలికి తొడుక్కుని వాడుకోవచ్చు. కానీ దీన్ని ఒక్కసారికి మాత్రమే వాడుకునే వీలుంది. దీని ఖరీదు కూడా చాలా తక్కువ. కేవలం 50 పైసలు మాత్రమే. ఇంతకీ దీన్ని ఈ అక్క ఎలా తయారు చేసిందో తెలుసా.. ఓ ప్రత్యేకమైన కాగితాన్ని తీసుకుని దానికి వనమూలికల మిశ్రమాన్ని, లవంగాలు, వేప తైలాలను అద్దింది. అంతే పేపర్‌టూత్ బ్రష్ తయారైపోయింది.
ఆలోచన ఎలా వచ్చిందంటే..
రెండు సంవత్సరాల క్రితం ఓసారి.. ధ్రువీ గుప్తా రైలులో ప్రయాణిస్తోంది. అప్పుడు తన టూత్‌బ్రష్ ఎక్కడో పోయింది. అప్పుడే తనకు ఓ ఆలోచన వచ్చింది. పేపర్ సోప్‌లు ఉన్నట్లే.. పేపర్ టూత్‌బ్రష్‌లుంటే ప్రయాణాల్లో భలే సౌకర్యంగా ఉంటుందనిపించింది. అనిపించడమే ఆలస్యం ఆ దిశగా ప్రయోగాలూ చేసి విజయం సాధించింది. ఈ ఆవిష్కరణకు గాను ధ్రువీ గుప్తా ‘సీఎస్‌ఐఆర్ ఇన్నోవేషన్’ అవార్డును అందుకుంది. అంటే ఇకపై ‘మీ టూత్‌పేస్టులో ఉప్పుందా? అనే బదులు మీ టూత్‌బ్రష్‌లో కాగితం ఉందా?’ అని అడగాలేమో! మొత్తానికి ధ్రువీ గుప్తా గ్రేట్ కదూ! మరింకేం భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలు చేయాలని ఆ అక్కయ్యకు ఆల్ ది బెస్ట్ చెప్పేయండి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyd ORR: డివైడర్‌ను దాటి ఢీకొట్టిన కారు.. ఇద్దరి మృతి, 8 మందికి తీవ్రగాయాలు
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Sundeep Kishan: రిలేషన్షిప్ నాకు సెట్ కాదు.. బ్రేకప్ దెబ్బ గట్టిగా తగిలింది: సందీప్ కిషన్
-
World News
Pervez Musharraf: ‘కార్గిల్’ కుట్ర పన్ని.. పదవి కోసం నియంతగా మారి..!
-
General News
Tirumala: నూతన పరకామణిలో శ్రీవారి హుండీ కానుకల లెక్కింపు.. భక్తులు చూసేలా ఏర్పాట్లు
-
World News
Musharraf: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత!