ఈ గడసరి.. భలే చదువరి
ఆరేళ్ల వయసులో ఏదైనా వాక్యం చదవమంటేనే కాస్త తడబడతారు. చదివేందుకు చాలా సమయం తీసుకుంటారు. అలాంటిది ఓ బుడతడు మాత్రం పుస్తకాలను తడబడకుండా గడగడా చదివేస్తున్నాడు. అంతేనా తన ప్రతిభతో రికార్డులూ అందుకుంటున్నాడు. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో ఏంటో తెలుసుకునేందుకు చదివేయండి...
ఆ నేస్తం పేరు రుద్ర రాజారాం పాటిల్. వయసు ఆరేళ్లు. ఉండేది మహారాష్ట్రలోని కొల్హాపూర్. ప్రస్తుతం రెండో తరగతి చదువుతున్నాడు.
పుస్తక పఠనంపై ఆసక్తి..
రుద్ర చిన్నప్పట్నుంచీ చురుకే! ఏం చెప్పినా ఇట్టే గుర్తుంచుకుని తిరిగి చెప్పేస్తాడు. ప్రతి విషయాన్ని అమ్మానాన్నలనడిగి క్షుణ్నంగా తెలుసుకుంటాడు. పుస్తకాలు చదవడమంటే ఇష్టమని చెప్పేవాడు. తనకున్న ఆసక్తిని గమనించిన అమ్మానాన్న.. కథల పుస్తకాలు కొని రుద్రకు ఇచ్చేవారు. అలా చిన్నవయసునుంచే పుస్తక పఠనం అలవాటు చేసుకున్నాడు.
అవలీలగా చదివేశాడు..!
రుద్ర కథల పుస్తకాలను వేగంగా చదవడం గమనించారు అమ్మానాన్న. తన ప్రతిభకు మరింత సానబెడుతూ సమయాన్ని నిర్దేశించి చదవమనేవారు. వాళ్లు చెప్పినట్లు నిర్ణీత సమయంలో పుస్తకాలను అవలీలగా చదివేసేవాడు రుద్ర. దాంతో తన ప్రతిభను అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో.. రికార్డు కమ్యూనిటీకి రుద్ర గురించి తెలియజేశారు. వాళ్లు రుద్రను పరీక్షించగా 29 కథల పుస్తకాలను కేవలం 15 నిమిషాల్లో చదివి ఔరా అనిపించాడు. తన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించేశాడు రుద్ర. ఆసక్తి ఉండాలేగానీ ఏదైనా సాధ్యమే అని నిరూపించాడు. నిజంగా రుద్ర గ్రేట్ కదూ! మరింకేం ‘శభాష్ రుద్ర’ అని మీరూ అభినందించండి..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
చనిపోయాడనుకొని ఖననం చేశారు.. కానీ స్నేహితుడికి వీడియో కాల్!
-
Ap-top-news News
Andhra News: పన్నులు వసూలు చేసే వరకూ సెలవుల్లేవ్
-
India News
JEE Main: జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
World News
Earthquake: ఈ దేశాల్లో నిత్యం భూప్రళయాలే
-
India News
Punjab: చేతులతో నాలుగు బుల్లెట్ బైక్లను ఆపిన యువకుడు
-
India News
Marriage: వరుడికి 65.. వధువుకు 23