రిత్విక్‌.. సాధనతో సాధించాడు..!

హాయ్‌ నేస్తాలూ..! ఎలా ఉన్నారు.. గణతంత్ర దినోత్సవాన్ని బాగా జరుపుకున్నారు కదా! ఇంతకీ మీకు.. రూబిక్‌ క్యూబ్స్‌ తెలుసా..? ఇంకా స్కేటింగ్‌ తెలుసా..? ‘అవి తెలియకపోవడం ఏంటి బాగా తెలుసు. చాలామంది ఆ ఆటల్లో రికార్డులు కూడా సాధించారు’ అంటారా..!

Updated : 27 Jan 2024 07:20 IST

హాయ్‌ నేస్తాలూ..! ఎలా ఉన్నారు.. గణతంత్ర దినోత్సవాన్ని బాగా జరుపుకున్నారు కదా! ఇంతకీ మీకు.. రూబిక్‌ క్యూబ్స్‌ తెలుసా..? ఇంకా స్కేటింగ్‌ తెలుసా..? ‘అవి తెలియకపోవడం ఏంటి బాగా తెలుసు. చాలామంది ఆ ఆటల్లో రికార్డులు కూడా సాధించారు’ అంటారా..! అది నిజమే కానీ, ఓ బుడతడు మాత్రం.. వీటిల్లోనే మరో విచిత్రమైన రికార్డు దక్కించుకున్నాడు. మరి తనెవరో? ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

ర్ణాటకలోకి బెంగళూరుకు చెందిన సి.రిత్విక్‌ సూర్యకు పదకొండేళ్లు. ప్రస్తుతం తను ఆరో తరగతి చదువుతున్నాడు. ఈ అబ్బాయి చిన్న వయసులో ఉన్నప్పుడు రూబిక్‌ క్యూబ్స్‌తోనే ఎక్కువగా ఆడుకునేవాడట. అలా మెల్లమెల్లగా వాటిని సాల్వ్‌ చేయడం నేర్చుకున్నాడు. తర్వాత కొన్ని రోజులకు అందులోనే రకరకాల క్యూబ్స్‌ని సాల్వ్‌ చేయడం మొదలుపెట్టాడు. మూడు, నాలుగు సాల్వ్‌ చేస్తేనే.. భలే చేశారే అనుకుంటాం. కానీ మన రిత్విక్‌ ఒకేసారి.. ఏకంగా 30 రూబిక్‌ క్యూబ్స్‌ సాల్వ్‌ చేశాడు. అది కూడా ఇన్‌లైన్‌ స్కేటింగ్‌ చేస్తూ. ఆశ్చర్యంగా ఉంది కదూ..! కానీ ఇది నిజమే నేస్తాలూ.. తను స్కేటింగ్‌ కూడా చాలా ఆసక్తిగా చేస్తాడట. కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు.. రూబిక్‌ క్యూబ్స్‌ సాల్వ్‌ చేయడం, స్కేటింగ్‌ ప్రాక్టీస్‌ చేయడం చేస్తుంటాడట.

సాధనతోనే..

వినడానికి ఎంత వింతగా ఉందో.. అది చేయడం అంతకంటే కష్టమట పిల్లలూ..! అనుకున్న సమయంలో ఈ టాస్క్‌ని పూర్తి చేయడానికి రిత్విక్‌ చాలా సాధన చేశాడట. స్కూల్‌కి వెళ్లే ముందు, వచ్చాక ఇలా ప్రాక్టీస్‌ చేస్తూనే ఉండేవాడట. ఇప్పుడు తన ప్రతిభతో ‘ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం దక్కించుకున్నాడు. తను ఇలాగే మరిన్ని రికార్డులు సాధించి ఉన్నత స్థానానికి చేరుకోవాలని మనమూ ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని