కొనుగోళ్లకు జీఎస్‌టీ ఊతం

ఇళ్లపై వస్తు సేవల పన్ను(జీఎస్టీ) ఏప్రిల్‌ నుంచి 5 శాతానికి తగ్గనుంది. ప్రస్తుతం 12 శాతం వసూలు చేస్తున్నారు. జీఎస్టీ కౌన్సిల్‌ ఈ నిర్ణయం ప్రకటించినప్పటి నుంచి ఇంటి కొనుగోలుదారులు ఏప్రిల్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

Published : 30 Mar 2019 01:40 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇళ్లపై వస్తు సేవల పన్ను(జీఎస్టీ) ఏప్రిల్‌ నుంచి 5 శాతానికి తగ్గనుంది. ప్రస్తుతం 12 శాతం వసూలు చేస్తున్నారు. జీఎస్టీ కౌన్సిల్‌ ఈ నిర్ణయం ప్రకటించినప్పటి నుంచి ఇంటి కొనుగోలుదారులు ఏప్రిల్‌ కోసం ఎదురుచూస్తున్నారు. తమకు నచ్చిన ప్రాజెక్ట్‌లో ఫ్లాట్‌ బుక్‌ చేసినా జీఎస్టీ తగ్గిన తర్వాత చెల్లింపులు చేసేందుకు ఎదురుచూస్తున్నారు. సోమవారం నుంచి వీరు తగ్గించిన జీఎస్టీ మేరకు చెల్లించవచ్చు. అందుబాటు ఇళ్లకు జీఎస్‌టీని 8 శాతం నుంచి ఏకంగా ఒక శాతానికి తగ్గించింది. దీంతో నగరంలో సామాన్య,మధ్యతరగతి వాసులకు సొంతింటి కొనుగోలులో భారం భారీగా తగ్గనుంది. నాన్‌ మెట్రోలో ఇంటి ధర రూ.45 లక్షల లోపు ఉండి.. 968 చదరపు అడుగుల విస్తీర్ణం లోపు ఉన్న ఇళ్లకు జీఎస్‌టీ ఒక శాతం వర్తిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని