Published : 18 Jun 2022 03:40 IST

అంతెత్తున ఉండాలంటే అధనం తప్పదు

ఈనాడు, హైదరాబాద్‌: ఆకాశహార్మ్యాల్లో పై అంతస్తుల్లో ఫ్లాట్‌ కొనుగోలు చేస్తే ఫ్లోర్‌ రైజ్‌ పేరుతో చదరపు అడుగుకు అదనపు ధరను నిర్మాణ సంస్థలు వసూలు చేస్తున్నాయి. కొన్ని సంస్థలు పదో అంతస్తు నుంచి వసూలు చేస్తుంటే మరికొన్ని సంస్థలు ఆరో అంతస్తు నుంచి వీటిని వసూలు చేస్తున్నాయి. ఇటీవల కాలంలో వీటి ధరలను బిల్డర్లు అమాంతం పెంచేశారు. 25వ అంతస్తు వరకైతే చదరపు అడుగుకు రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా తీసుకుంటున్నారు. బేసిక్‌ ధరకు ఇవి అదనం. అయితే ఇటీవల కాలంలో నగరంలో 30 నుంచి 45 అంతస్తుల వరకు నిర్మాణాలు వస్తున్నాయి. సిటీలోనే అత్యంత ఎత్తులో నివాసాలు ఉండాలని చాలామంది ఆకాశహార్మ్యాల వైపు చూస్తున్నారు. ఫ్లోర్‌ రైజ్‌ ఛార్జీలతో అవాక్కవుతున్నారు. 25వ అంతస్తు తర్వాత చదరపు అడుక్కి రూ.400 నుంచి రూ.500 అదనంగా చెబుతున్నారు. చివరి అంతస్తుల్లో ఉండాలంటే ప్రీమియం ధరలు చెల్లించాల్సి వస్తోంది. అంతస్తులు పెరిగేకొద్దీ నిర్మాణ వ్యయం పెరుగుతుందని అందుకే అదనపు ఛార్జీలని నిర్మాణ సంస్థలు అంటున్నాయి.  

పార్కింగ్‌లోనూ వేర్వేరుగా..
గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఇటీవల కాలంలో వెయ్యి నుంచి నాలుగువేల ఫ్లాట్లు ఉండేలా అపార్ట్‌మెంట్లు కడుతున్నారు. మూడు పడక గదులు, ఆపై కొనుగోలు చేసినవారికి రెండు పార్కింగ్‌ సదుపాయాలు కల్పిస్తున్నారు. దీంతో పార్కింగ్‌కు చోటు సరిపోవడం లేదు. ఆకాశహార్మ్యాల ప్రాజెక్టుల్లో ఏకంగా నాలుగు బేస్‌మెంట్లు పార్కింగ్‌ కోసం కేటాయిస్తున్నారు.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts