22 అంతస్తులు దాటితే ఫైర్‌ లిఫ్ట్‌లు

నగరాల్లో ఆకాశహార్మ్యాల నిర్మాణాలు పెరుగుతున్నాయి. 20 నుంచి 50 అంతస్తుల వరకు నిర్మిస్తున్నారు. వీటిలో ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగితే? మంటలు వ్యాపించకముందే బయటపడాలంటే?.. ఇందుకోసం భవనాల్లో ప్రత్యేక లిఫ్ట్‌లు ఉండాలని అంటోంది మహారాష్ట్ర ప్రభుత్వం. 22 అంతస్తులు దాటితే ఫైర్‌ ఎవక్యుయేషన్‌

Published : 30 Jul 2022 01:45 IST

ముంబయిలో తప్పనిసరి చేసిన అక్కడి ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌ : నగరాల్లో ఆకాశహార్మ్యాల నిర్మాణాలు పెరుగుతున్నాయి. 20 నుంచి 50 అంతస్తుల వరకు నిర్మిస్తున్నారు. వీటిలో ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగితే? మంటలు వ్యాపించకముందే బయటపడాలంటే?.. ఇందుకోసం భవనాల్లో ప్రత్యేక లిఫ్ట్‌లు ఉండాలని అంటోంది మహారాష్ట్ర ప్రభుత్వం. 22 అంతస్తులు దాటితే ఫైర్‌ ఎవక్యుయేషన్‌ లిఫ్ట్‌(ఎఫ్‌ఈఎల్‌)ను తప్పనిసరి  చేసింది. ముంబయిలోని భవనాల్లో  అగ్నిప్రమాదాలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అక్కడ 2008 నుంచి 2018 వరకు చిన్న, పెద్ద కలిపి 48,434 ప్రమాదాలు జరిగాయి. ఆకాశహార్మ్యాల్లో 1568 జరిగినట్లు గుర్తించారు. భారీ ప్రమాదాల వేళ అక్కడ నివసిస్తున్న వారిని వేగంగా బయటికి తరలించడం పెద్ద సవాల్‌గా మారింది. దీంతో 2018లోనే ఫైర్‌ లిఫ్ట్‌ను తప్పనిసరి చేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లోనూ ఇటీవల 20 అంతస్తులపైన నిర్మాణాలు వస్తున్నాయి. ఇక్కడేమో 52 మీటర్ల ఎత్తు వరకే చేరుకోగల అగ్నిమాపక స్కై క్రేన్లు ఉన్నాయి. మన దగ్గర కూడా వీటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.  

మంటలను తట్టుకుంటాయ్‌..

అగ్నిప్రమాద సమయంలో సాధారణంగా లిఫ్ట్‌లు వినియోగించవద్దని నిపుణులు చెబుతుంటారు. మెట్ల మార్గంలోనే వెళ్లాలని సూచిస్తుంటారు. పది అంతస్తులైతే దిగి రాగలరు.. అంతకంటే ఎక్కువ అంటే కష్టం. చాలా సమయం పడుతుంది. దీంతో ప్రత్యేక లిఫ్ట్‌లు ఉంటే త్వరగా బయటికి తీసుకురావొచ్చు. ఫైర్‌ ఎవక్యుయేషన్‌ లిఫ్ట్‌లను ప్రత్యేకంగా రూపొందిస్తారు. రెండు గంటల పాటు మంటలను తట్టుకుంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని