ఆ రెండు నగరాల్లో కొత్త ప్రాజెక్టులు

దేశంలోని ఏడు అగ్రశ్రేణి నగరాల్లో గత ఏడాది కంటే ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 25 శాతం అధికంగా కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభం అయ్యాయి. వీటిలో 1.02 లక్షల ఇళ్లు ఉన్నాయి. గత ఏడాది 82,500 యూనిట్లు మాత్రమే మొదలయ్యాయి.

Published : 01 Jul 2023 02:56 IST

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోని ఏడు అగ్రశ్రేణి నగరాల్లో గత ఏడాది కంటే ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 25 శాతం అధికంగా కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభం అయ్యాయి. వీటిలో 1.02 లక్షల ఇళ్లు ఉన్నాయి. గత ఏడాది 82,500 యూనిట్లు మాత్రమే మొదలయ్యాయి.

  • ఆర్థిక రాజధాని ముంబయి వాటానే 43 శాతంపైగా ఉంది. ఇక్కడ 43,390 యూనిట్లు ప్రారంభం అయ్యాయి. క్రితం ఏడాదితో పోలిస్తే 31 శాతం పెరిగాయి. మొత్తం కొత్త ప్రాజెక్టులో 61 శాతం రూ.80 లక్షల బడ్జెట్‌ ధరల్లోనివే.
  • పుణెలోనూ ప్రారంభాలు సానుకూలంగా ఉన్నాయి. 21,350 యూనిట్లు ప్రారంభించారు. అంతక్రితం ఏడాది 16,560 ఇళ్లు చేపట్టారు. పెరుగుదల శాతం 29గా ఉంది.
  • హైదరాబాద్‌లో మార్కెట్‌ స్తబ్దుగా ఉంది. ఇక్కడ కొత్తగా 10,470 యూనిట్లు మాత్రమే మొదలయ్యాయని అనరాక్‌ సంస్థ వెల్లడించింది. గతంతో పోలిస్తే తగ్గడం గమనార్హం. కొత్తవాటిలోనూ 43 శాతం ఖరీదైన ఇళ్లే ఉన్నాయి. కోటిన్నర రూపాయలపైన ఉన్నవే కావడం ఇక్కడి మార్కెట్‌ను తెలియజేస్తోంది.
  • దిల్లీ రాజధాని ప్రాంతం యూనిట్ల సంఖ్య 52 శాతం పెరిగినా 8460 యూనిట్లకు మించలేదు. ఇక్కడి మార్కెట్‌ పెద్దగా ఆశాజనకంగా లేదు.
  • చెన్నైలో 5040 ఇళ్లు కొత్తగా ప్రారంభించారు. గతంతో పోలిస్తే 71 శాతం పెరుగుదలతో మార్కెట్‌ గాడిలో పడుతోంది.
  • కోల్‌కతాలో 2460 మాత్రమే నూతనంగా మొదలెట్టారు. ఇక్కడ సైతం క్రితం ఏడాదితో పోలిస్తే 22  శాతం పెరుగుదల నమోదైంది. రూ.40-80 లక్షల మధ్య ఇక్కడ ఇళ్లు అందుబాటులో ఉన్నాయి.
  • ఏడింట ఐదు నగరాల్లో సానుకూల వృద్ధి నమోదు కాగా... మిగతా రెండు నగరాల్లో ప్రతికూలంగా ఉంది.
  • బెంగళూరులో 11,440 యూనిట్లు కొత్తగా ప్రారంభించారు. ఇక్కడ 9 శాతం తగ్గాయి. రూ.40 లక్షల నుంచి రూ.1.5 కోటి లోపల ఉన్న ఇళ్లు ఇక్కడ అత్యధికంగా 68 శాతం ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని