కోకాపేట వైపు బడా సంస్థల చూపు

హెచ్‌ఎండీఏ కోకాపేట- నియోపొలిస్‌ లేఅవుట్‌లో ప్లాట్లు కొనేందుకు బడా సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. శుక్రవారం ఆన్‌లైన్‌లో జరిగిన ప్రీబిడ్‌ సమావేశానికి ఆయా సంస్థల ప్రతినిధులు హాజరై వివరాలు ఆరా తీశారు.

Published : 29 Jul 2023 00:40 IST

ఈనాడు, హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ కోకాపేట- నియోపొలిస్‌ లేఅవుట్‌లో ప్లాట్లు కొనేందుకు బడా సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. శుక్రవారం ఆన్‌లైన్‌లో జరిగిన ప్రీబిడ్‌ సమావేశానికి ఆయా సంస్థల ప్రతినిధులు హాజరై వివరాలు ఆరా తీశారు. ప్రీ బిడ్‌ సమావేశంలో షాపూర్‌జీ పల్లోంజీ, ఎన్‌సీసీ, మైహోం, రాజ్‌పుష్పా తదితర ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార సంస్థలే కాకుండా ప్రెస్టేజ్‌ లాంటి కంపెనీలు ఉన్నాయి. కోకాపేటలో నియోపొలిస్‌ పేరుతో హెచ్‌ఎండీఏ 500 ఎకరాల్లో లేఅవుట్‌ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రూ.450 కోట్లతో రహదారులతోపాటు తాగునీరు, మురుగు నీటి వ్యవస్థ, భారీ కేబుళ్ల కోసం ప్రత్యేక మార్గం ఇతర అన్ని రకాల సదుపాయాలు కల్పించారు. ఇప్పటికే తొలి విడత వేలంలో కొంత భూమిని విక్రయించగా రికార్డు స్థాయిలో ధర పలికింది. అత్యధికంగా ఎకరా రూ.60 కోట్లకు అమ్ముడుపోయింది. దీంతో ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరింది. అదే ఉత్సాహంతో మిగిలిన 45.33 ఎకరాలను ఈ-వేలం వేసేందుకు హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. ఆగస్టు 3న రెండు విడతలుగా ఈ ప్రక్రియ చేపట్టనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు