మోకిలలో మూడో రోజు గజం రూ.76 వేలు

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మోకిలలో హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లో ప్లాట్లకు డిమాండ్‌ కొనసాగుతోంది. మూడో రోజు శుక్రవారం 60 ప్లాట్లకు వేలం వేశారు.

Published : 26 Aug 2023 01:19 IST

ఈనాడు, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మోకిలలో హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లో ప్లాట్లకు డిమాండ్‌ కొనసాగుతోంది. మూడో రోజు శుక్రవారం 60 ప్లాట్లకు వేలం వేశారు. గరిష్ఠంగా గజం రూ.76వేలు ఈ-వేలంలో పలికింది. కనిష్ఠంగా గజం ధర రూ.55వేలు కాగా.. సరాసరి గజం ధర రూ.64,159 పలికింది. మూడో రోజు హెచ్‌ఎండీఏకు రూ.131.97కోట్ల ఆదాయం వచ్చింది. మూడు రోజుల్లో 180 ప్లాట్ల ద్వారా రూ.387.11 కోట్ల రెవెన్యూ సమకూరింది. వేలం పాటలు మళ్లీ సోమ, మంగళ వారాల్లో జరగనున్నాయి. మోకిలలో హెచ్‌ఎండీఏ 165 ఎకరాల విస్తీర్ణంలో ఒక్కోటి 300 గజాల చొప్పున 1321 ప్లాట్లతో రెసిడెన్షియల్‌ లేఅవుట్‌ వేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని