ఇళ్ల రిజిస్ట్రేషన్లలో పెరుగుదల
నగరంలో ఆగస్టు నెలలో ఇళ్ల రిజిస్ట్రేషన్లు జులైతో పోలిస్తే 17 శాతం పెరిగాయి. జులైలో 5557 ఇళ్లు రిజిస్ట్రేషన్లు అయితే.. ఆగస్టులో వీటి సంఖ్య 6493కి పెరిగిందని నైట్ ఫ్రాంక్ ఇండియా గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
గుట్టల బేగంపేటలో రూ.8.2 కోట్ల విలువైన స్థిరాస్తి రిజిస్ట్రేషన్
ఈనాడు, హైదరాబాద్ : నగరంలో ఆగస్టు నెలలో ఇళ్ల రిజిస్ట్రేషన్లు జులైతో పోలిస్తే 17 శాతం పెరిగాయి. జులైలో 5557 ఇళ్లు రిజిస్ట్రేషన్లు అయితే.. ఆగస్టులో వీటి సంఖ్య 6493కి పెరిగిందని నైట్ ఫ్రాంక్ ఇండియా గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. గత ఏడాది ఆగస్టు (5656) కంటే కూడా 15 శాతం అధికమని తెలిపింది. ఆగస్టు మాసంలో అత్యధిక విలువ కల్గిన 5 రిజిస్ట్రేషన్ల వివరాలను నివేదికలో పొందుపర్చారు. గుట్టల బేగంపేటలో 3వేల చదరపు అడుగుల కంటే.. ఎక్కువ విస్తీర్ణం కల్గిన ఇల్లు రూ.8.20 కోట్లతో రిజిస్ట్రేషన్ జరిగింది. బంజారాహిల్స్‌లో రూ.7.47 కోట్లతో ఒకటి, రూ.5.60 కోట్ల విలువైన రెండు స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఖైరతాబాద్‌లో రూ.4.76 కోట్ల విలువైన ఇల్లు చేతులు మారింది.
రూ.25-50 లక్షల ధరల శ్రేణిలో...
ఆగస్టు నెలలో మొత్తం ఇళ్ల రిజిస్ట్రేషన్లలో రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల ధరల శ్రేణిలోనివి 52 శాతం ఉన్నాయి. గత ఏడాది కంటే ఈ విభాగంలో 3 శాతం తగ్గాయి. ధరల పెరుగుదలే దీనికి కారణం. నిజానికి ఈ ధరల్లో ఇల్లు వస్తే మేలే కదా అంటారా?. ఇక్కడే మతలబు ఉంది. ఇవి రిజిస్ట్రేషన్ ధరలు మాత్రమే. వాస్తవంగా కొన్నధరలు దీనికి రెట్టింపు ఉంటున్నాయి.
- 25 లక్షల రిజిస్ట్రేషన్ ధరల లోపు 16 శాతం, రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షల ధరల శ్రేణిలో 16 శాతం, రూ.75 లక్షల నుంచి రూ.కోటి వరకు 8 శాతం ఉన్నాయి.
- రూ.కోటి నుంచి రూ.రెండు కోట్ల మధ్య రిజిస్ట్రేషన్ ఇళ్ల వాటా 7 శాతం ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఒక శాతం పెరిగింది. రూ.రెండు కోట్లపైన ఇళ్ల వాటా 2 శాతం స్థిరంగా కొనసాగుతోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం
-
Vijay antony: కుమార్తె మృతి.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ పోస్ట్
-
Sai Rajesh: నా సాయం పొందిన వ్యక్తే నన్ను తిట్టాడు: ‘బేబీ’ దర్శకుడు
-
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే.. ఈ రికార్డులు నమోదవుతాయా?
-
Military Tank: సైనిక శిక్షణ కేంద్రంలో మాయమై.. తుక్కులో తేలి!
-
NTR: ‘ఏఐ’ మాయ.. ఎన్టీఆర్‌ని తలపించేలా.. ఫొటో వైరల్