వాస్తు ప్రకారం పెద్దల ఇళ్లు

నగరంలో పెద్దల జనాభా పెరుగుతోంది. వీరి అవసరాలకు అనుగుణంగా తక్కువ విస్తీర్ణంలో గృహ నిర్మాణాలు చేపడుతున్నారు. సొంతంగా కట్టుకునేవారు వీరి మోడల్స్‌ను అనుసరించవచ్చు.

Published : 30 Sep 2023 02:00 IST

ఈనాడు, హైదరాబాద్‌ : నగరంలో పెద్దల జనాభా పెరుగుతోంది. వీరి అవసరాలకు అనుగుణంగా తక్కువ విస్తీర్ణంలో గృహ నిర్మాణాలు చేపడుతున్నారు. సొంతంగా కట్టుకునేవారు వీరి మోడల్స్‌ను అనుసరించవచ్చు. అక్టోబరు మొదటి సోమవారం అంతర్జాతీయ గృహ వసతి దినోత్సవం సందర్భంగా వాస్తు నిపుణులు పి.కృష్ణాది శేషు.. పెద్దల ఇళ్లలో వాస్తుపరంగా జాగ్రత్తలు సూచిస్తున్నారు.

ఒంటరి అవుతున్న పెద్దలను దృష్టిలో పెట్టుకుని ఇంటి నిర్మాణంలో మార్పులు రావడం సంతోషమే. పిల్లలు విదేశాల్లో స్థిరపడటం, వృత్తి రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉండటంతో వృద్ధాప్యంలో నిర్వహణ దృష్ట్యా చిన్న ఇళ్లు మేలు. ఒత్తిడి లేని.. అవసరాలు తీరేలా ఇంట్లో గదులు, సామగ్రి అమరిక ఉండాలి. వాస్తు ప్రకారం ఉంటే ప్రకృతికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉండేవారు ఆరోగ్యంగా ఉంటారు. త్వరగా అలసటకు గురికారు. చిన్న ఇల్లు అయినా చింత లేకుండా ఉంటారు.

  • చాలా తక్కువ విస్తీర్ణంలో వాస్తు కుదిరేలా చిన్న ఇళ్లు కడుతున్నారు. విశాలమైన హాల్‌.. అందులోనే వంటగది కోసం ప్లాట్‌ఫామ్‌ నిర్మిస్తున్నారు. ఒక పడక గది ఉంటోంది. 
  • చిన్న ఇల్లు కాబట్టి రెండు, నాలుగు ద్వారాలు సరిపోతాయి. సంఖ్యాపరంగా అనుకూలమిది.
  • ఏవైపు అయినా ముఖ ద్వారం ఉండొచ్చు. తూర్పు, పడమరలకు ద్వారాలు ఉంటే.. ఉత్తర, దక్షిణానికి కిటికీలు ఉండేలా చూసుకోవాలి. క్రాస్‌ వెంటిలేషన్‌ ఉంటే ఇంట్లోకి గాలి, వెలుతురు బాగా వస్తుంది.
  • పడక గది నైరుతి, దక్షిణంలో ఏర్పాటు చేసుకోవచ్చు. వాయువ్యంలో కూడా ఉండొచ్చు. స్నానాల గది ఈశాన్యం కాకుండా ఎటువైపు అయినా ఏర్పాటు చేసుకోవచ్చు. నైరుతి ఉత్తమం.
  • వంట గది ఆగ్నేయ మూలలో ఉండేలా చూసుకోవడం ఉత్తమ మార్గం. దేవుడి అల్మారా తూర్పు ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవచ్చు.
  • గుమ్మానికి ఎదురుగా తులసి కోట... ఎండ తగిలేలా ఈశాన్యం వైపు ఏర్పాటు చేసుకోవాలి. తులసికి పూజ చేసే క్రమంలో మన శరీరానికి ఎండ తగులుతుంది. విటమిన్‌ ‘డి’ అందుతుంది. పెద్ద వయసులో ఇది చాలా అవసరం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని