ఈఎంఐ భారం.. సరసమైన ఇళ్లు దూరం

సరసమైన ఇళ్ల కొనుగోలుదారులపై స్థిరాస్తుల ధరలపెరుగుదల, వడ్డీరేట్ల పెంపు ప్రభావం అధికంగా ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

Updated : 14 Oct 2023 07:35 IST

సరసమైన ఇళ్ల కొనుగోలుదారులపై స్థిరాస్తుల ధరలపెరుగుదల, వడ్డీరేట్ల పెంపు ప్రభావం అధికంగా ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. డౌన్‌ పేమెంట్‌ 7 శాతం పెరగగా... ఈఎంఐ భారం ఏకంగా 14 శాతం భారమైంది. వీటికి పరిష్కారంగా వడ్డీరేట్లపై సబ్సిడీ ఇవ్వడం, డౌన్‌ పేమెంట్‌ శాతాన్ని తగ్గించడం.. దీర్ఘకాలానికి గృహ రుణాలను మంజూరు చేస్తే కొంత ఊరట ఉంటుందని రియాల్టీ సంస్థలు సూచిస్తున్నాయి.

  • దేశవ్యాప్తంగా రూ.50 లక్షల లోపు సరసమైన ఇళ్ల మార్కెట్‌ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా నివేదికలో పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 10 శాతం అమ్మకాలు తగ్గాయి. డౌన్‌పేమెంట్‌, ఈఐఎం భారం కావడమే ఇందుకు కారణం. 2021 మొదలు వరసగా ఏడు త్రైమాసికాల్లోనూ తగ్గుదల నమోదైంది.  

  • 50 లక్షల నుంచి కోటి రూపాయల గృహాల్లో 14 శాతం పెరుగుదల కన్పించింది. ఇందులో కొంచెం హెచ్చుతగ్గులు ఉన్నాయి. కొన్నిసార్లు పెరగడం.. మళ్లీ తగ్గడం గమనించవచ్చు.
  • కోటిపైన ఇళ్ల విక్రయాలు ఏకంగా 39 శాతం పెరిగాయి. ఈ విభాగం 2021 తొలి త్రైమాసికం నుంచి ఇప్పటివరకు పెరుగుతూనే ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని