నిలకడగా అద్దెలు

భాగ్యనగరంలో ఇతర నగరాలతో పోలిస్తే ఆఫీస్‌ మార్కెట్‌ కొవిడ్‌ తర్వాత వేగంగా పుంజుకుంది. విస్తృతమైన మౌలిక వసతులు, తక్కువ అద్దెల కారణంగా ఐటీ నగరాలైన బెంగళూరు, పుణే నగరాలకు గట్టి పోటీ ఇస్తోంది.  

Published : 28 Oct 2023 05:54 IST

ఈనాడు, హైదరాబాద్‌: భాగ్యనగరంలో ఇతర నగరాలతో పోలిస్తే ఆఫీస్‌ మార్కెట్‌ కొవిడ్‌ తర్వాత వేగంగా పుంజుకుంది. విస్తృతమైన మౌలిక వసతులు, తక్కువ అద్దెల కారణంగా ఐటీ నగరాలైన బెంగళూరు, పుణే నగరాలకు గట్టి పోటీ ఇస్తోంది.  

  • ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, బయోటెక్నాలజీ, రక్షణ పరిశోధనలకు కేంద్రమైన హైదరాబాద్‌లో గ్రేడ్‌ ‘ఏ’ కార్యాలయాల అద్దెలు నిలకడగా పెరుగుతూనే ఉన్నాయి.
  • హైదరాబాద్‌ ప్రధాన నగరంగా చెప్పుకొనే సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్‌(సీబీడీలో) సగటున చదరపు అడుగు అద్దెల ధర రూ.50కి చేరింది.
  • ఐటీ సంస్థలకు నెలవైన పశ్చిమ హైదరాబాద్‌లో పీబీడీ(వెస్ట్‌)లో అత్యధికంగా చదరపు అడుగు అద్దెల ధర  రూ.75కి పెరిగింది. మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, మణికొండ, హైటెక్‌సిటీ ప్రాంతాల్లో కార్యాలయాల ఏర్పాటుకు ఐటీ సంస్థలు మొగ్గు చూపుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని