Hyderabad Real Estate: బడ్జెట్‌ నివాసాల కోసం

నగరంలో బడ్జెట్‌ ధరల్లో నివాసాలు పలు ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయని నిర్మాణ సంఘాలు చెబుతున్నాయి. 500 నుంచి 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో గల ఆవాసాలు ప్రాంతాలను బట్టి రూ.40 లక్షల నుంచి రూ.65 లక్షల ధరల శ్రేణిలో ఉన్నాయని చెబుతున్నారు.

Updated : 02 Dec 2023 09:29 IST

ఈనాడు, హైదరాబాద్‌

గరంలో(Hyderabad Real Estate) బడ్జెట్‌ ధరల్లో నివాసాలు పలు ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయని నిర్మాణ సంఘాలు చెబుతున్నాయి. 500 నుంచి 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో గల ఆవాసాలు ప్రాంతాలను బట్టి రూ.40 లక్షల నుంచి రూ.65 లక్షల ధరల శ్రేణిలో ఉన్నాయని చెబుతున్నారు. పశ్చిమ హైదరాబాద్‌లో మినహాయిస్తే మిగతా జోన్లలో ఇవి ఎక్కువగా అందుబాటులో ఉన్నాయని అంటున్నారు. సెంట్రల్‌ జోన్‌లో పరిమితంగా ఉన్నాయని తూర్పు, ఉత్తరం, దక్షిణ జోన్లలో లభ్యత ఎక్కువని చెప్పారు.

తూర్పులో..

  • అన్నోజిగూడ, బండ్లగూడ, కర్మాన్‌ఘాట్‌, కుషాయిగూడ, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌, మల్లాపూర్‌, పోచారం, ఉప్పల్‌, ఘట్‌కేసర్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడే గేటెడ్‌ కమ్యూనిటీలు, ప్రీమియం ప్రాజెక్టులు ఉన్నాయి.
  • ఆదిభట్లలో పెద్ద ఎత్తున నిర్మాణం పూర్తి చేసుకున్న, నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. సగటున చ.అ. రూ.4వేల ధరల శ్రేణిలో ఇక్కడ ఫ్లాట్లను విక్రయిస్తున్నట్లు బిల్డర్‌ ఒకరు తెలిపారు. ఐటీ, ఏరోసెజ్‌లో పనిచేసే ఉద్యోగులు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు.

ఉత్తరంలో..

కొంపల్లి, సుచిత్ర చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ అందుబాటు ధరల్లో నివాసాలు ఉన్నాయి. బహదూర్‌పల్లి, దుండిగల్‌, గాజుల రామారం, జీనోమ్‌వ్యాలీ, గుండ్లపోచంపల్లి, కౌకూరు, మల్లంపేట, మారేడుపల్లి, శామీర్‌పేటలలో బడ్జెట్‌ ధరల్లో అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. పెద్ద ఎత్తున గేటెడ్‌ కమ్యూనిటీల్లో ప్రీమియం ప్రాజెక్టులు సైతం అందుబాటులో ఉన్నాయి. ఎవరి బడ్జెట్‌కు తగ్గ వాటిని వారు కొనుగోలు చేయవచ్చు.


దక్షిణంలో..

శంషాబాద్‌, లక్ష్మీగూడ, సాతంరాయి, తుక్కుగూడ ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లు వస్తున్నాయి. ఇక్కడ విలాసవంతమైన ప్రాజెక్ట్‌లతో పాటూ బడ్జెట్‌ హోమ్స్‌ సైతం ఉన్నాయి. సిటీకి దగ్గరగా ఉన్న ముఖ్యంగా ఐటీకి దగ్గరున్న ప్రాంతాల్లో ఇవి ఒకటిగా ఉన్నాయి.  ః అవుటర్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎక్కువగా బడ్జెట్‌ ధరల్లో అపార్ట్‌మెంట్లు ఉన్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని