పని ప్రదేశం.. లక్ష చ.అ. మించి విస్తీర్ణం

హైదరాబాద్‌కు గ్లోబల్‌ క్యాపబుల్‌ సెంటర్స్‌(జీసీసీ) రాకతో కార్యాలయాల లీజింగ్‌ విస్తీర్ణం పెరిగింది. లక్ష చదరపు అడుగులు అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీల్లో వార్షిక వృద్ధి 50 శాతానికిపైగా నమోదైంది. 2023లో లక్ష చదరపు అడుగులపైన భవనాల విస్తీర్ణమే 54 లక్షల చ.అ.కు చేరింది. మొత్తం లావాదేవీల్లో వీటి వాటా 61 శాతం ఉంది.

Published : 03 Feb 2024 02:44 IST

కార్యాలయాల లీజింగ్‌లో అత్యధిక వాటా వీటిదే

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు గ్లోబల్‌ క్యాపబుల్‌ సెంటర్స్‌(జీసీసీ) రాకతో కార్యాలయాల లీజింగ్‌ విస్తీర్ణం పెరిగింది. లక్ష చదరపు అడుగులు అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీల్లో వార్షిక వృద్ధి 50 శాతానికిపైగా నమోదైంది. 2023లో లక్ష చదరపు అడుగులపైన భవనాల విస్తీర్ణమే 54 లక్షల చ.అ.కు చేరింది. మొత్తం లావాదేవీల్లో వీటి వాటా 61 శాతం ఉంది.
హైదరాబాద్‌లో కొన్నేళ్లుగా సగటున ఏడాదిలో కోటి చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాల భవనాలు అందుబాటులోకి వస్తున్నాయి. కొత్తగా కడుతున్నవాటిలో ఏ గ్రేడ్‌ కార్యాలయాలే అత్యధికంగా ఉంటున్నాయి. బహుళ జాతి కంపెనీలు వీటికే ప్రాధాన్యమిస్తున్నాయి. జీసీసీలు వరసకట్టడంతో లక్ష నుంచి రెండున్నర చ.అ. లక్షల విస్తీర్ణంలో కార్యాలయాలు ఏర్పాటుచేస్తున్నాయి. గత ఏడాది ఒక సంస్థనే 2.58 లక్షల చ.అ. విస్తీర్ణంలో జీసీసీని ఏర్పాటుచేసింది.

ఎంఎన్‌సీలతో..

  • 2022లో అధిక విస్తీర్ణంలోని కార్యాలయాల లావాదేవీలు 36 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జరగ్గా.. 2023 నాటికి 54 లక్షల చ.అ.కు పెరిగింది. వీటి వాటా 61 శాతంగా ఉంది. ః అదే సమయంలో 50వేల నుంచి లక్షలోపు చ.అ. కార్యాలయాల లావాదేవీలు 6.67 శాతం తగ్గాయి. 2022లో 15 లక్షల చ.అ. లీజింగ్‌ జరగ్గా.. 2023లో 14 లక్షలకు తగ్గింది. ఈ మధ్యస్థ కార్యాలయాల వాటా 15 శాతంగా ఉంది.
  • 50వేల చ.అ.లోపు ఉన్న చిన్న కార్యాలయాల్లోనూ డిమాండ్‌ కనిపించింది. 31.25 శాతం వృద్ధి నమోదైంది. 2022లో 16 లక్షల చ.అ. విస్తీర్ణంలో కార్యాలయాల లావాదేవీలు జరగ్గా.. 2023లో 21 లక్షల చ.అ.కు పెరిగింది. వీటి వాటా 23 శాతంగా ఉందని ఒక నివేదిక పేర్కొంది.

రిటైలింగ్‌లోనూ జోరు

నగరంలో రిటైలింగ్‌కు సంబంధించి చెప్పుకోతగ్గ లావాదేవీలు గత ఏడాది జరిగాయి. మాల్స్‌ చేతులు మారుతున్నాయి. వీటిని ఆధునికీకరించి లీజింగ్‌కు ఇస్తున్నారు. మొత్తం లావాదేవీల్లో వస్త్ర దుకాణాలు అత్యధికంగా 31 శాతం వాటా ఆక్రమించాయి. హైపర్‌ మార్కెట్ల వాటా 26శాతం ఉంది. హోంవేర్‌, డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌లు 19 శాతం లీజ్‌కు తీసుకున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని