రెరా ఏం చెబుతుంది?
వ్యాపార ధోరణితో సాగే స్థిరాస్తి విపణిలో ఇల్లు కొంటే నాణ్యత లోపాలు, పనుల్లో జాప్యం, మోసాలు, అవకతవకలు కొనుగోలుదారులను వేధిస్తున్నాయి. వీటిని నియంత్రించి కొనుగోలుదారులకు బాసటగా నిలిచేందుకు కేంద్రం స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి చట్టం(రెరా) తీసుకురాగా.
వ్యాపార ధోరణితో సాగే స్థిరాస్తి విపణిలో ఇల్లు కొంటే నాణ్యత లోపాలు, పనుల్లో జాప్యం, మోసాలు, అవకతవకలు కొనుగోలుదారులను వేధిస్తున్నాయి. వీటిని నియంత్రించి కొనుగోలుదారులకు బాసటగా నిలిచేందుకు కేంద్రం స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి చట్టం(రెరా) తీసుకురాగా. తెలంగాణలో 2017 ఆగస్టు 4 నుంచి అమల్లోకి వచ్చింది. రెరా అథారిటీ అనుమతి పొందిన స్థిరాస్తి విషయంలో ఏవైనా వివాదాలు ఉత్పన్నమైతే. సాధారణ న్యాయస్థానానికి కాకుండా రెరాలో పొందుపర్చిన న్యాయాధికారి ద్వారా తక్షణ న్యాయం పొందేందుకు వెసులుబాటు ఉంది.
రెరా అనుమతి లేనిదే ఏ స్థిరాస్తి ప్రాజెక్టు నిర్మాణాలను, అమ్మకాలను చేపట్టరాదు. ఇలాంటి ఎన్నో నిబంధనలు చట్టంలో ఉన్నాయి. కొనుగోలుదారుల హక్కులకు పెద్ద పీట వేశారు. వీరికి అవగాహన పెంపొందించేందుకు చట్టం ఉపయోగాలు, ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి...
* రెరా గుర్తింపు లేకుండా 8ప్లాట్లు/ 500 చ.మీ. దాటిన స్థలంలో నిర్మాణాలను ప్రారంభించరాదు. ముందస్తుగా ఎలాంటి అమ్మకాలు చేపట్టరాదు. దరఖాస్తు చేసే సమయంలోనే వారికి ఈ రంగంలో ఉన్న అనుభవం, నిర్మాణానికి కావాల్సిన మూలధన వివరాలను వెల్లడించాలి.
* నిర్మాణంలో సేవలందించే వేర్వేరు భాగస్వాములు ఇంజినీరు, అర్కిటెక్ట్, ఏం.ఇ.పి., సీ.ఏ., కాంట్రాక్టరు తదితర వివరాలను రెరాకు తెలియజేయాలి.
* రెరా నుంచి నమోదు పత్రం లేకుండా నిర్మాణానికి సంబంధించి ప్రకటనలు, కరపత్రాలు, గోడ పత్రికలను వేయరాదు. ప్రీలాంచ్ విక్రయాలు చేపట్టరాదు.
* కొనుగోలుదారుల నుంచి పొందిన సొమ్ములో 70 శాతం ప్రత్యేక ఖాతాలో జమ చేసి.. అందుకు అనుగుణంగా నిర్మాణ పనులు జరుగుతున్నట్లు రుజువులు చూపించాలి. ప్రత్యేక ఖాతా నుంచి నగదును ఇతర అవసరాలకు తీసుకోవడానికి వీల్లేకుండా నిబంధనలు రూపొందించారు. ప్రతి త్రైమాసికానికి జమా ఖర్చుల వివరాలను రెరా అథారిటీకి సమర్పించాలి.
* కొనుగోలుదారు నుంచి ఆస్తి విలువలో 10 శాతం కంటే ఎక్కువగా బయానాగా తీసుకోవాలంటే ఇరువురి మధ్య సిఫార్సు చేసిన నమూనా ప్రకారం ఒప్పందం కుదుర్చుకుని ఉండాలి. బయానా తీసుకున్న రోజే ఇంటిని స్వాధీన పర్చే తేదీని లిఖితపూర్వకంగా వెెల్లడించాలి. ఒప్పందం ప్రకారం పనులను, సౌకర్యాలను కల్పించాలి. ఏ పనిని, ఏ రోజుకు పూర్తిచేస్తామనే విషయాలపై సవివరంగా హామీ ఇవ్వాలి.
* ఒప్పందంలో, ప్లాన్‌లో పేర్కొన్న నమూనా ప్రకారం కాకుండా నిర్మాణంలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయాలన్నా కొనుగోలుదారుల నుంచి లిఖితపూర్వక సమ్మతి ఉండాలి.
* నిర్మాణ పురోగతిని ప్రతి మూడు నెలలకు ఒకసారి నివేదిక, చిత్రాలను రెరా వెబ్‌సైట్‌లో కొనుగోలుదారులు చూసేందుకు వీలుగా అందుబాటులో ఉంచాలి.
* స్థిరాస్తి కొనుగోళ్లు ఎక్కువగా మధ్యవర్తుల ద్వారానే జరుగుతుంటాయి. అందుకే మధ్యవర్తిని కూడా రెరా చట్టం పరిధిలోకి తీసుకొచ్చి వారికి చట్టబద్ధంగా గుర్తింపునకు నమోదు ప్రక్రియను రూపొందించింది. మధ్యవర్తి చేసే సేవా లోపాలకు నిర్మాణదారుడిని సహ బాధ్యుడిగా నిబంధనల్లో పేర్కొన్నారు. ఆలస్యమైతే వడ్డీ చెల్లించాలి..
* ఒప్పందంలో పేర్కొన్న తేదీ నాటికి నిర్మాణం పూర్తి చేసి ఇంటిని కొనుగోలు దారులకు అప్పగించాలి. గడువు దాటినా స్వాధీన పర్చనట్లయితే రెరా సిఫార్సు చేసిన వడ్డీని ప్రతినెలా కొనుగోలుదారుకు చెల్లించాలి.
* నాణ్యతా లోపాలకు నిర్మాణదారే ఐదేళ్ల వరకు బాధ్యుడిగా చట్టంలో పేర్కొన్నారు. ఏదైనా లోపాలను కొనుగోలుదారుడు బిల్డర్ దృష్టికి తీసుకెళితే ఎలాంటి రుసుములు లేకుండా ఉచితంగా మరమ్మతులు చేసి ఇవ్వాలి.
* నిర్మాణం పూర్తై ఆస్తులను విక్రయించాక కొనుగోలుదారుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి ఉమ్మడి ఆస్తి, సదుపాయాలను వారికి అప్పగించడం కూడా నిర్మాణదారే చేయాలని చట్టం చెబుతోంది.
* రెరా ప్రకారం కార్పెట్ ఏరియా, ఫ్లింత్ ఏరియా, కామన్ ఏరియాను విడివిడిగా చూపించాలి. ఇదివరకు మూడూ కలిపి సూపర్ బిల్టప్ ఏరియాగా విక్రయించేవారు.
* కార్పెట్ ఏరియా: ఫ్లాట్‌లో బయటి గోడలు, బాల్కనీలు, వాష్ ఏరియాను మినహాయించి లోపల ఉన్న విస్తీర్ణాన్ని కార్పెట్ ఏరియాగా చూపిస్తున్నారు.
* ఫ్లింత్ ఏరియా: స్లాబ్ ఏరియానే ఫ్లింత్ ఏరియా చెబుతుంటారు. ఫ్లాట్ లోపలి విస్తీర్ణంతోపాటూ బయటిగోడలు, బాల్కనీలు, వాష్ ఏరియా పూర్తిగా ఇందులోకి వస్తాయి.
* కామన్ ఏరియా: కారిడార్, మెట్లు, లిఫ్ట్ స్థలాన్ని ప్రతి ఫ్లోర్‌కు లెక్కిస్తున్నారు. లిఫ్ట్, మెట్ల హెడ్‌రూమ్స్, వాటర్ ట్యాంకులు, వాటర్ సంపులు, వాచ్‌మెన్ గదిని కూడా కామన్ ఏరియాలో కలిపేస్తున్నారు.
ఉదాహరణకు..
* ఒక ప్రాజెక్ట్‌లో రెండు పడక గదుల ఫ్లాట్ 1105 చ.అ.సూపర్‌బిల్టప్ ఏరియా అయితే.. కార్పెట్ ఏరియా 760 చ.అ., ఫ్లింత్ ఏరియా 920 చ.అ., కామన్ ఏరియా 185 చ.అ.గా చూపించారు.
* మూడు పడకల ఫ్లాట్ అయితే సూపర్‌బిల్టప్ ఏరియా 1956 చ.అ. ఇందులో 1365 చ.అ. కార్పెట్ ఏరియా, 1630 చ.అ. ఫ్లింత్‌ఏరియా, 326 చ.అ. కామన్ ఏరియాగా చూపిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Anand Mahindra: ఐపీఎల్ ఫైనల్‌పై వైరల్‌గా మారిన ఆనంద్ మహీంద్రా ట్వీట్!
-
Politics News
Eatela rajender: పొంగులేటి.. జూపల్లి నాకే రివర్స్ కౌన్సెలింగ్ ఇస్తున్నారు: ఈటల
-
Politics News
BJP: ప్రధాని మోదీ టార్గెట్ విజన్-2047: కేంద్ర మంత్రి మేఘ్వాల్
-
India News
Manipur: ప్రజలను మానవకవచాలుగా వాడుకొని దాడులు.. మణిపుర్ వేర్పాటు వాదుల కుట్ర
-
India News
Bimal Hasmukh Patel: కొత్త పార్లమెంట్‌ను చెక్కిన శిల్పి.. ఎవరీ బిమల్ పటేల్
-
Movies News
Siddharth: రియల్ లైఫ్‌లో లవ్ ఫెయిల్యూర్.. సిద్దార్థ్ ఏం చెప్పారంటే