ఆసియా పసిఫిక్‌లో అగ్రభాగాన మన నగరాలు

కార్యాలయాల భవనాల్లో మన నగరాలు అంతర్జాతీయంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని మొదటి 20 నగరాల జాబితాలో దిల్లీ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్‌) మూడో స్థానంలో నిలిచింది.

Published : 15 Jul 2023 00:30 IST

ఫ్లెక్సిబుల్‌ ఆఫీసు స్టాక్‌లో కొనసాగుతున్న డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌ : కార్యాలయాల భవనాల్లో మన నగరాలు అంతర్జాతీయంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని మొదటి 20 నగరాల జాబితాలో దిల్లీ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్‌) మూడో స్థానంలో నిలిచింది. రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్‌ఈ 2023 తొలి భాగానికి సంబంధించిన ఆసియా పసిఫిక్‌ ఫ్లెక్సిబుల్‌ ఆఫీసు మార్కెట్‌ నివేదికను తాజాగా వెల్లడించింది. 8.4 మిలియన్‌ చదరపు అడుగులతో ‘ఏ’ గ్రేడ్‌ కార్యాలయాల విభాగాల్లో బీజింగ్‌, సియోల్‌ను దిల్లీ నగరం వెనక్కి నెట్టింది. ఫెక్సిబుల్‌ స్టాక్‌లో బెంగళూరులో 12.9 మిలియన్‌ చదరపు అడుగులతో మొదటి స్థానంలో నిలిచింది. 6 మిలియన్‌ చదరపు అడుగులతో హైదరాబాద్‌ నగరం ఆరో స్థానంలో ఉంది. మొదటి పది స్థానాల్లో ముంబయితో కలిపి నాలుగు నగరాలు ఉన్నాయి. సిడ్ని, సింగపూర్‌, హంగ్‌కాంగ్‌ నగరాల కంటే మన నగరాలు ముందున్నాయి.

  • కొవిడ్‌ తర్వాత ఫెక్సిబుల్‌ కార్యాలయాల స్థలాలకు డిమాండ్‌ పెరిగిన సంగతి తెలిసిందే. మార్చి 23 నాటికి ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో 87 మిలియన్‌ చదరపు అడుగులకు వీటి విస్తీర్ణం చేరింది. సెప్టెంబరు 2022తో పోలిస్తే 6 శాతం పెరుగుదల నమోదైంది. దాదాపు 3వేల కార్యాలయాల కేంద్రాలు ఫెక్సిబుల్‌ సదుపాయాల్ని కల్పిస్తున్నాయి.
  • ఈ తరహా కార్యాలయాలను అత్యధికంగా ఐటీ కంపెనీలు లీజుకు తీసుకుంటున్నాయి. వీటి వాటా 35 శాతంగా ఉంది. వ్యాపార సేవల సంస్థలు 16 శాతం, ఆర్థిక సంస్థల వాటా 12 శాతం, రిటైల్‌ సంస్థలు 8 శాతం, జీవశాస్త్రాల వాటా 7 శాతంగా ఉంది.  

వ్యూహాత్మక ఎంపిక

ప్రపంచమార్కెట్లో ఆర్థిక ఆనిశ్చితి వాతావరణంతో వ్యాపార సంస్థలు తక్కువ వ్యయంతో కూడిన ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ స్పేస్‌ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ కారణంగా వీటికి డిమాండ్‌ కొనసాగుతోంది. వ్యాపారాల కోసం వ్యూహాత్మక ఎంపికగా భావిస్తున్నాయి. నిరంతరం వృద్ధి ప్రాముఖ్యతను తెలియజేస్తోంది.

అన్షుమన్‌ మ్యాగజైన్‌, సీఈవో, సీబీఆర్‌ఈ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని