వంటలు నేర్చుకోండి...వయసు తగ్గించుకోండి!

పెరుగుతున్న వయసుని వెనక్కి మళ్లించాలని.. 20ల్లో మాదిరిగా పరుగులు పెట్టాలని అందరికీ ఉంటుంది. ఈ దిశగా జరుగుతున్న తాజా పరిశోధనలు చెప్పిన ఆరోగ్య చిట్కాలివి...

Published : 02 Oct 2022 00:01 IST

పెరుగుతున్న వయసుని వెనక్కి మళ్లించాలని.. 20ల్లో మాదిరిగా పరుగులు పెట్టాలని అందరికీ ఉంటుంది. ఈ దిశగా జరుగుతున్న తాజా పరిశోధనలు చెప్పిన ఆరోగ్య చిట్కాలివి...


* గ్రీన్‌టీ ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలుసుగా! అయితే దాని ఖాతాలోకి... మరో ప్రయోజనం కూడా వచ్చి చేరింది. ఇది తాగడం వల్ల చర్మం తేమతో నిగనిగలాడుతుందట. సాగే గుణాన్ని పెంచుకుని వయసుని కాస్త వెనక్కి మళ్లిస్తుందట.


* పోషకాహారం తింటే ఒంటికి మంచిదని తెలుసు. కానీ మంచి మంచి వంటలు నేర్చుకోవాలన్న ఆలోచన వచ్చినా కూడా మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆశ్చర్యంగా ఉన్నా నిజం. ఎప్పుడూ ఒకేరకం వండేవాళ్లతో పోలిస్తే కుకింగ్‌ క్లాసులకు వెళ్తూ కొత్త వంటకాలని ప్రయత్నించేవాళ్లు మానసికంగానూ, శారీరకంగానూ కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి.



* ఈసారి కాయగూరల దూకాణానికి వెళ్లినప్పుడు పుట్టగొడుగుల్ని కూడా కార్ట్‌లో వేసుకోండి. ఎందుకంటారా? శరీరంలో క్యాన్సర్‌ కంతులు పెరగడాన్ని ఈ పుట్టగొడుగులు సమర్థంగా నిరోధిస్తాయట. అందుకే వారంలో ఒక సారన్నా వాటిని తిందాం.


* వారంలో కనీసం పావుకిలో సీఫుడ్‌ అయినా తింటే గుండెకు మేలు జరుగుతుందని అంటున్నాయి అధ్యయనాలు. కానీ తీర ప్రాంతం ఎక్కువ ఉండే ప్రజలు కూడా ఇంత మొత్తంలో తినడం లేదట. చికెన్‌ మటన్‌కి బదులు వారంలో ఒక్కరోజు చేపల్ని తిని చూడండి.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని