ఎంత బాగుందో!

ముర్రుపాలతో చేసే జున్ను అంటే ఇష్టపడని వారుండరేమో. పంచదార లేదా బెల్లం..యాలకుల పొడిని జత చేసే ఈ వంటకం తెలుగువారి ఫేవరెట్‌. ముంబయిలో కూడా ఖర్వాస్‌, బల్లిమలై, బరీ అని పిలిచే ఈ తీపి పదార్థానికి భలే డిమాండ్‌.

Published : 25 Jun 2023 00:59 IST

ముర్రుపాలతో చేసే జున్ను అంటే ఇష్టపడని వారుండరేమో. పంచదార లేదా బెల్లం..యాలకుల పొడిని జత చేసే ఈ వంటకం తెలుగువారి ఫేవరెట్‌. ముంబయిలో కూడా ఖర్వాస్‌, బల్లిమలై, బరీ అని పిలిచే ఈ తీపి పదార్థానికి భలే డిమాండ్‌. తాజాగా గులాబీ, పసుపు, పిస్తాగ్రీన్‌ వంటి వర్ణాల్లో కనిపిస్తోన్న ఈ స్వీట్‌ పుడింగ్‌ని సన్నని ముక్కలుగా కత్తిరించి ఇస్తోన్న స్ట్రీట్‌ వెండార్‌  వీడియో ఒకటి బాగా వైరలైంది. ‘ఫుడీ ఇన్‌కార్నేట్‌’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన దీన్ని పది రోజుల్లోనే కోటిమందికిపైగా చూశారు. వేలమంది...తమ చిన్ననాటి అనుభూతుల్నీ, ఈ వంటకంతో ఉన్న అనుబంధాన్నీ పంచుకుంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు