ఆవిరి మీద ఆకు రుచులు

భారతదేశం విభిన్న సంస్కృతుల సమ్మేళనం. అందుకే, ఆసేతు హిమాచలం...ఎన్నెన్నో ప్రత్యేకతలు చూస్తుంటాం.

Published : 02 Jul 2023 00:23 IST

భారతదేశం విభిన్న సంస్కృతుల సమ్మేళనం. అందుకే, ఆసేతు హిమాచలం...ఎన్నెన్నో ప్రత్యేకతలు చూస్తుంటాం. ముఖ్యంగా ఆ ప్రాంతాల్లోని వాతావరణం, వ్యవసాయం, ఆచార సంప్రదాయాలు, జీవనశైలికి అనుగుణంగా అక్కడి ప్రజల ఆహారపుటలవాట్లు ఉంటాయి. అలా ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన త్రిపుర సిగ్నేచర్‌ రెసిపీ అవాన్‌ బంగ్వీ. కొత్త సంవత్సరమైన బిషు వేడుకల వేళ, ఇంటి శుభకార్యాలప్పుడూ దీన్ని తప్పనిసరిగా తయారు చేస్తారు. జిగట బియ్యం, బెల్లం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, అల్లం, ఉల్లిపాయ, ఎండు ద్రాక్ష వంటి పదార్థాలతో ఈ అవాన్‌ బంగ్వీని వండుతారు. ఈ వంటకాన్ని అరటి ఆకులు లేదా బంగ్విని లైరు అని పిలిచే ఓ రకమైన పత్రాల్లో చుట్టి ఆవిరి మీద ఉడికిస్తారు. కమ్మగా, తీయగా ఉండే ఇది ఆరోగ్యానికీ ఎంతో బలమని అక్కడి వారు నమ్ముతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని