ఫూల్‌ మఖానా.. ఆరోగ్యానికి చిరునామా

తెల్ల తెల్లగా, చిన్న చిన్నగా థర్మాకోల్‌ గోలీల్లా కనిపిస్తూ ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఫూల్‌ మఖానా. బిహారీలూ, మహరాష్ట్రవాసులూ మక్కువగా తినే మఖానా ఇప్పుడిప్పుడు మనవాళ్లూ తింటున్నారు.

Published : 16 Jul 2023 00:19 IST

పోషకాలమ్‌

తెల్ల తెల్లగా, చిన్న చిన్నగా థర్మాకోల్‌ గోలీల్లా కనిపిస్తూ ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఫూల్‌ మఖానా. బిహారీలూ, మహరాష్ట్రవాసులూ మక్కువగా తినే మఖానా ఇప్పుడిప్పుడు మనవాళ్లూ తింటున్నారు. స్వతహాగా దీనికంటూ ప్రత్యేకమైన రుచి ఏమీ ఉండదు కానీ రుచిగా తయారుచేసుకోవచ్చు. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, భాస్వరం విస్తారంగా ఉన్నందున మంచి పోషకాహారం. ఇందులో చెక్కెర లేదు కనుక మధుమేహ వ్యాధితో బాధపడుతున్నవాళ్లు నిరభ్యంతరంగా తినొచ్చు. ఊబకాయులు వీటిని తినడం వల్ల సత్వర ఫలితం ఉంటుంది. ఇందులోని పీచు జీర్ణ ప్రక్రియకు తోడ్పడుతుంది. క్యాల్షియం ఎముకలను దృఢంగా ఉంచుతుంది. కొలెస్ట్రాల్‌ స్థాయిని పెరగనివ్వదు. రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య స్థిరంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నందున రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. మఖానా తినడం వల్ల నిద్రలేమి నుంచి బయటపడొచ్చు. బరువు పెరగరు. ఇది ఆర్థరైటిస్‌ను నివారిస్తుంది. అన్నిటి కంటే ముఖ్యంగా మఖానా తింటే చర్మం ముడతలు పడదు. అంటే వయసు కనిపించదు. ఎంత బాగుంది కదూ.. యాంటీ ఏజెనింగ్‌ క్రీములు ఉపయోగించే బదులు వీటిని కొంచెం ఆరగిస్తే సరిపోతుంది. ఇంత శ్రేష్టమైంది కనుక ఇక నుంచి తరచూ తిందాం! ఇంతకీ మఖానా అంటే ఏంటో కొందరికి తెలియకపోవచ్చు.. అందమైన కలువ పుష్పాలు తెలుసు కదా! వాటి గింజలను వేయించి పగలగొట్టి తీస్తే వచ్చేవే ఫూల్‌ మఖానా. ఇంగ్లీష్‌లో లోటస్‌ సీడ్స్‌ లేదా ఫాక్స్‌ నట్స్‌ అంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని