జొన్నలతో మేలైన వంటకం

సింధీ వంటల్లో ‘జువర్‌ జో బథువా’ మహా రుచికరమైంది. తెల్లటి పిండి మీద సగ్గుబియ్యం, మిరియాలు వెదజల్లినట్లు ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తుందో!

Updated : 23 Jul 2023 02:11 IST

సింధీ వంటల్లో ‘జువర్‌ జో బథువా’ మహా రుచికరమైంది. తెల్లటి పిండి మీద సగ్గుబియ్యం, మిరియాలు వెదజల్లినట్లు ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తుందో! చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుందంటే అతిశయం కాదు. దీన్ని ఉదయానే ఫలహారంగా సేవిస్తారు.
సింధీ వాళ్ల మీద మొఘల్‌, పర్షియన్‌, అరబిక్‌ ఆచారాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. వాళ్ల ఆహారం కూడా ఆయా సంస్కృతుల మిశ్రమంగా ఉంటుంది. ఆ రుచులు, సుగంధాలు తమదైన ప్రత్యేకతను చాటుతూ అలరిస్తాయి. ఇంతకీ ‘జువర్‌ జో బథువా’ ఎలా తయారుచేస్తారంటే.. జొన్నపిండిని నీళ్లతో కలిపి సన్న సెగమీద చక్కగా ఉడికిస్తారు. పూర్తిగా ఉడికిందనుకున్నాక యాలకుల పొడి వేస్తారు. తర్వాత తీపి తినేవాళ్లు బెల్లం లేదా పంచదార, కారం ఇష్టపడేవాళ్లు మిరియాల పొడి వేస్తారు. సులువుగా పూర్తయ్యే ఈ వంటకం రుచీ, ఆరోగ్యం కూడా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని