వెదురు మొలకల కూర

అరుణాచల్‌ ప్రదేశ్‌ వాసులు ఇష్టంగా తినే ఆహారంలో వెదురు మొలకల కూర ఒకటి. దీని తయారీ పెద్ద కష్టమేం కాదు. లేత వెదురు మొక్కలను చిన్నగా తరిగి, ఒక రోజంతా నీళ్లలోనే ఉంచాలి.

Published : 30 Jul 2023 00:34 IST

రుణాచల్‌ ప్రదేశ్‌ వాసులు ఇష్టంగా తినే ఆహారంలో వెదురు మొలకల కూర ఒకటి. దీని తయారీ పెద్ద కష్టమేం కాదు. లేత వెదురు మొక్కలను చిన్నగా తరిగి, ఒక రోజంతా నీళ్లలోనే ఉంచాలి. అలా నానబెట్టిన వెదురు ముక్కలను మర్నాడు కుక్కర్‌లో ఉడికించి మూడు విజిల్స్‌ వచ్చాక దింపేయాలి. జార్‌లో కొబ్బరి ముక్కలు, లవంగాలు, ఇలాచి, దాల్చినచెక్క, కొన్ని మిరియాలు, చారెడు వేయించిన ధనియాలు, పసుపు, మిర్చి వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. నూనెలో ఆవాలు, కరివేపాకు వేగాక ఉల్లిపాయ ముక్కలు, సగానికి చీల్చిన పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి దోరగా వేగనివ్వాలి. అందులో గ్రైండ్‌ చేసిన మిశ్రమం వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. తర్వాత వెదురు ముక్కలు వేసి అరగ్లాసు నీళ్లు పోసి, ఐదు నిమిషాలు ఉడికించాలి. కూర దగ్గర పడిన తర్వాత ఉప్పు వేసి దించేయాలి. రోటీ, చపాతీల్లో దీన్ని మక్కువగా తింటారు. ఈ వంటకాన్ని శాకాహారులు టొమాటోలు, క్యారెట్లు చేర్చి వండితే, మాంసాహారులు చికెను, మటను జోడిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని