రోటీల రుచి పెంచే సాగ్‌

రోజూ తినే అన్నం కూరలకు భిన్నంగా తినాలనుకుంటే పంజాబీ ధాబాకి వెళ్తాం. అక్కడ మన జిహ్వ మెచ్చే రకాలు దొరుకుతాయి.

Published : 20 Aug 2023 01:32 IST

రోజూ తినే అన్నం కూరలకు భిన్నంగా తినాలనుకుంటే పంజాబీ ధాబాకి వెళ్తాం. అక్కడ మన జిహ్వ మెచ్చే రకాలు దొరుకుతాయి. పంజాబీలు ఇష్టంగా తినే పదార్థాల్లో ‘సరసోం కా సాగ్‌’ ఒకటి. పేరు తమాషాగా ఉంది కదూ! మాంసాహారులు కూడా మెచ్చే ఈ శాకాహార వంటకం దాదాపు అన్ని పంజాబీ హోటళ్లలో దొరుకుతుంది. ఇంతకీ దీన్నెలా చేస్తారంటారా?! మహా సులువుగా.. మనం కూడా చేసుకోవచ్చు. ఆవాల ఆకులు, బచ్చలి, మెంతి కూరలను శుభ్రంచేసి కొన్ని నీళ్లు, కాస్త ఉప్పు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. చల్లారాక మొక్కజొన్న పిండి కలపాలి. మందపాటి గిన్నెలో నెయ్యి, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించాలి. అందులో ఆకుకూర మిశ్రమం, కారం, గరంమసాలా, ధనియాల పొడి వేసి మూతపెట్టి ఐదు నిమిషాలు సన్న సెగ మీద ఉడికించాలి. దించే ముందు నెయ్యి, బెల్లంపొడి, మసాలా ఛాట్‌ వేయాలి. స్వచ్ఛమైన నేతితో అమృతాన్ని తలపించే రుచి వస్తుంది. సరసోం కా సాగ్‌ రుచిపరంగా పసందుగా ఉండటమే కాదు.. మంచి పోషకాలతో శరీరానికి శక్తినిస్తుంది. మనకు తోటకూర, పాలకూరల్లా పంజాబీలకి ఆవాల మొక్కల ఆకులంటే మక్కువ. దీంతో రోటీలు అమోఘంగా ఉంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు