చెక్క.. ఆరోగ్య సంరక్షిణి

మసాలా కూరలూ, పులావ్‌, టొమాటో రైస్‌ లాంటి వాటిల్లో దాల్చినచెక్కతో చక్కటి రుచి, ఘుమాయింపు వస్తాయి

Published : 20 Aug 2023 01:32 IST

మసాలా కూరలూ, పులావ్‌, టొమాటో రైస్‌ లాంటి వాటిల్లో దాల్చినచెక్కతో చక్కటి రుచి, ఘుమాయింపు వస్తాయి. ప్రొటీన్లు, పిండిపదార్థాలు, పీచు, క్యాల్షియం, పొటాషియం, కెరోటిన్‌, ఎ, బి, కె విటమిన్లతో ఇది మంచి పోషకాహారం. ఇందులో అనేక ఆరోగ్య రహస్యాలూ దాగున్నాయి. యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు ఉన్నందున వ్యాధినిరోధకంగా పనిచేస్తుంది. జీర్ణప్రక్రియ మెరుగవుతుంది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్లను నిరోధిస్తుంది. శ్వాసకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. టైప్‌ టూ డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్‌ స్థాయి సమంగా ఉంటుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. అండాశయ సమస్యలు తలెత్తవు. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది. మొటిమలను అరికడుతుంది. వాపు, దద్దుర్లు లాంటివి తగ్గుతాయి. ఊబకాయాన్ని నివారిస్తుంది. చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. కంటిచూపు బాగుంటుంది. ఎలర్జీలకు ఔషధంలా పనిచేస్తుంది. పార్కిన్‌సన్‌, అల్జీమర్స్‌ వ్యాధులు ప్రబలకుండా కాపాడుతుంది. తరచూ వంటల్లో ఉపయోగిద్దాం, ఆరోగ్యాన్ని సంరక్షించుకుందాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని