తీపీ పులుపుల సాంగ్రీ

రాజస్థాన్‌ వాసులకు ‘కేర్‌ సాంగ్రీ కీ సబ్జీ’ ప్రియమైన వంటకం. చూడటానికి పెద్దగా ఆకర్షణీయంగా కనిపించదు.. కానీ మహా రుచిగా ఉంటుంది.

Published : 27 Aug 2023 01:06 IST

రాజస్థాన్‌ వాసులకు ‘కేర్‌ సాంగ్రీ కీ సబ్జీ’ ప్రియమైన వంటకం. చూడటానికి పెద్దగా ఆకర్షణీయంగా కనిపించదు.. కానీ మహా రుచిగా ఉంటుంది. ఎలా చేయాలో ముందు తెలుసుకుందాం.. డిజర్ట్‌ బీన్స్‌గానూ పిలుచుకునే చిక్కుడు జాతికి చెందిన సాంగ్రీ కాయలు, కేర్‌ అక్కడ ప్రసిద్ధం. వీటిని ఎండబెట్టి అమ్ముతారు కనుక ఏడాది పొడవునా దొరుకుతాయి. ఈ రెండింటినీ కడిగి ముందు రోజు రాత్రి.. సుమారు 8 గంటలు నానబెట్టాలి. నీళ్లు వంపేసి కప్పు నీళ్లు పోసి కుక్కర్‌లో 4 విజిల్స్‌ వచ్చేవరకూ ఉడికించాలి. ఒక పాత్రలో కాస్త నూనె వేసి అందులో కేర్‌, సాంగ్రీ మిశ్రమం, రెండు ఎండు మిర్చి, అర చెంచా వాము, పావు చెంచా ఇంగువ, కొంచెం పసుపు, ఒకటిన్నర చెంచా కారం, చెంచా ఎండు మామిడి పొడి (ఆమ్‌చూర్‌), రెండు స్పూన్ల ధనియాల పొడి, కొద్దిగా బెల్లం, పావు కప్పు కిస్‌మిస్‌ వేసి ఐదు నిమిషాలు సన్న సెగ మీద ఉడికించాలి. చివర్లో కొత్తిమీర తరుగు వేసి దించేయాలి. అంతే తియ్య తియ్యగా, పుల్ల పుల్లగా ఉండే ‘కేర్‌ సాంగ్రీ కీ సబ్జీ’ సిద్ధమైపోతుంది. ఇది అన్నం, చపాతీలు.. ఎందులోకైనా బాగుంటుంది. మంచి పోషక విలువలు ఉన్న ఈ రాజస్థానీ వంటకాన్ని మనమూ ప్రయత్నిద్దామా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని