ముల్లంగి తింటున్నారా..

వర్షాకాలం దొరికే దుంపకూరల్లో ముల్లంగి ఒకటి. కొంచెం వెగటుగా ఉండే మాట నిజమే. అయితేనేం.. ఇందులో పొటాషియం, పీచు, జింక్‌, భాస్వరం, మెగ్నీషియం, కాపర్‌, క్యాల్షియం, ఐరన్‌, మాంగనీస్‌, ఎ, బి6, సి, ఇ, కె విటమిన్లు విస్తారంగా ఉన్నాయి.

Updated : 03 Sep 2023 05:02 IST

ర్షాకాలం దొరికే దుంపకూరల్లో ముల్లంగి ఒకటి. కొంచెం వెగటుగా ఉండే మాట నిజమే. అయితేనేం.. ఇందులో పొటాషియం, పీచు, జింక్‌, భాస్వరం, మెగ్నీషియం, కాపర్‌, క్యాల్షియం, ఐరన్‌, మాంగనీస్‌, ఎ, బి6, సి, ఇ, కె విటమిన్లు విస్తారంగా ఉన్నాయి. ఇంత మంచి పోషకాహారం కనుకనే చాలామంది తమ ఆహారంలో చేర్చుకుంటారు. కూర, చారు, పచ్చడి, సలాడ్‌.. ఇలా ముల్లంగితో ఏదైనా చేసుకోవచ్చు. ముల్లంగితో కంటిచూపు మెరుగవుతుంది. ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. ఇది గుండెను కవచంలా కాపాడుతుంది. ఎర్ర రక్తకణాలను వృద్ధి చేస్తుంది. రక్తానికి ఆక్సిజన్‌ అందించడంలో, బీపీని అదుపు చేయడంలో ఉపయోగపడుతుంది. ఒంట్లో చేరిన మలినాలను తొలగిస్తుంది. జీర్ణప్రక్రియ బాగుంటుంది. మధుమేహం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాలేయం, మూత్రపిండాల్లో అపసవ్యతలను తొలగిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ముఖం ముడతలు పడకుండా కాపాడుతుంది. చర్మం నేవళంగా ఉండటం వల్ల వయసు కనిపించదు. శరీరాన్ని డీహైడ్రేషన్‌ బారిన పడనివ్వదు. ఎన్ని లాభాలో కదా! అందుకే ముల్లంగి దొరికే కాలంలో తరచూ తినమంటారు ఆరోగ్య నిపుణులు. తిందామా మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని