దాల్‌.. బాటీ.. చూర్మా..

రాజస్థాన్‌ అంటేనే అందం, ఆకర్షణ. వాళ్ల వంటలూ పసందైనవే. ‘దాల్‌ బాటీ చూర్మా’ కూడా అలాంటిదే. దీన్నెలా చేయాలంటే..

Updated : 15 Oct 2023 02:55 IST

రాజస్థాన్‌ అంటేనే అందం, ఆకర్షణ. వాళ్ల వంటలూ పసందైనవే. ‘దాల్‌ బాటీ చూర్మా’ కూడా అలాంటిదే. దీన్నెలా చేయాలంటే.. గోధుమ పిండిలో కొంచెం బేకింగ్‌ సోడా, ఉప్పు, నెయ్యి వేసి కొన్ని నీళ్లతో చపాతీ పిండిలా బాగా కలపాలి.  పిండిని చిన్న బాల్స్‌లా చేయాలి. ప్రతి బాల్‌నూ ఒకటికి రెండుసార్లు సగానికి విరిచినట్లు చేసి మళ్లీ కలిపి.. పైన ప్లస్‌ మార్క్‌ వచ్చేలా చూడాలి. అప్పాల పాత్ర (గుంట పొంగడాల) గుంటల్లో కాస్త నెయ్యి వేసి.. బాల్స్‌ను సన్న సెగ మీద వేయించాలి. వాటిని నేతిలో ముంచి తీస్తే- బాటీలు తయారైనట్లే! కొన్ని బాటీలను అలాగే ఉంచి.. మరికొన్నిటిని గ్రైండ్‌ చేసి.. బంగారు రంగు వచ్చేదాకా నేతిలో వేయించాలి. అందులో పంచదార పొడి, జీడిపప్పు, బాదం పలుకులు, యాలకుల పొడి వేసి కలిపి దించేస్తే.. చూర్మా సిద్ధమైపోతుంది. కడాయిలో నేతి తాలింపులో ఉల్లి, టొమాటో, అల్లం వెల్లుల్లి ముద్ద, మిర్చి, వేగాక.. ఉడికించిన పెసలు, ఎర్ర కందిపప్పు, శనగపప్పుల మిశ్రమం, కారం, గరంమసాలా, పసుపు, ఉప్పు వేసి దగ్గరపడనివ్వాలి. చివర్లో కొత్తిమీర తరుగు వేస్తే.. ఘుమఘుమలాడే పప్పు కూడా సిద్ధమైపోతుంది. నేతితో తయారైన ఈ మూడింటి కాంబినేషన్‌ సూపర్‌గా ఉంటుంది. ఈ ‘దాల్‌ బాటీ చూర్మా’ నచ్చితే.. మీరూ చేసి చూడండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని