దురియన్‌... దీని రుచే వేరు!

ఈ పేరు కొత్తగా ఉంది కదూ! మనదేశంలో దొరకదు మరి! సుమారుగా 30 సెం.మీ పొడవు, 15 సెం.మీ వెడల్పుతో ఉండే చిత్రమైన పండిది. మలేషియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌ లాంటి దేశాల్లో పండుతుంది.

Updated : 22 Oct 2023 05:52 IST

ఈ పేరు కొత్తగా ఉంది కదూ! మనదేశంలో దొరకదు మరి! సుమారుగా 30 సెం.మీ పొడవు, 15 సెం.మీ వెడల్పుతో ఉండే చిత్రమైన పండిది. మలేషియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌ లాంటి దేశాల్లో పండుతుంది. ఇది మన పనసపండులానే బయట గరుగ్గా.. లోపల తొనలు విడిగా లేకున్నా.. కొంచెం అలాగే ఉంటుంది. ఘాటైన పరిమళం, ప్రత్యేక రుచితో ఆకట్టుకుంటుంది. మంచి పోషకాహారం. చిత్రమేంటంటే.. కొందరికేమో చాలా నచ్చుతుంది. ఇంకొందరేమో దీని పేరు చెబితేనే వెగటుగా ముఖం పెడతారు. ఇంతకీ టేస్టు సంగతేంటి అంటారా.. చీజ్‌, బాదం, వెల్లుల్లి, పంచదార.. అన్నీ కలగలసినట్లు ఉంటుంది. ఆసియాలోని అనేక ప్రాంతాల్లో ఈ పండ్లు తింటారు. కొత్తవాళ్లు దీన్ని చూడగానే.. ఆకర్షితులవుతారు. పెళుసుగా ఉండే దీన్ని కోయడం కంటే పగులగొట్టడమే తేలిక. ఈ పండుతో జ్యూస్‌, సూప్‌, ఐస్‌క్రీం, చాక్లెట్లు, మరెన్నో స్వీట్లు తయారు చేస్తారు. అనేక ఔషధాల్లోనూ దీన్ని ఉపయోగిస్తారు. ఇంత మంచి పండు మనకెప్పుడు అందుబాటులోకి వస్తుందో మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని