ములక్కాడల ఆవకూర తిన్నారా..

ములక్కాడ రుచే సూపర్‌ కదూ! టొమాటో, వంకాయ, చిక్కుడు.. ఇలా దేనితో కలిపి వండినా అద్భుతమే. పప్పుచారుకి ప్రత్యేకత తెచ్చేస్తుంది, దోసకాయ కూర రుచి పెంచేస్తుంది.

Published : 22 Oct 2023 00:22 IST

ములక్కాడ రుచే సూపర్‌ కదూ! టొమాటో, వంకాయ, చిక్కుడు.. ఇలా దేనితో కలిపి వండినా అద్భుతమే. పప్పుచారుకి ప్రత్యేకత తెచ్చేస్తుంది, దోసకాయ కూర రుచి పెంచేస్తుంది. నేను ములక్కాడలతో ఆవకూర చేస్తాను. ఇదెంత రుచికరమో.. తయారీ అంత సులువు. ఎలా చేయాలంటే.. ములక్కాడలను వేలెడంత ముక్కలుగా కోసి.. నీళ్లలో వేయాలి. బంగాళదుంపలు చెక్కు తీసి అంగుళమంత ముక్కలు కోసుకోవాలి. ఉల్లి, టొమాటో కూడా చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. కడాయిలో నూనె వేసి.. ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఇంగువలు వేయాలి. అవి వేగాక.. ఉల్లి తరుగును దోరగా వేయించాలి. అందులో బంగాళదుంప, టొమాటో, ములక్కాడ ముక్కలు, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, ఆవాల పొడి, అల్లం పచ్చిమిర్చి ముద్ద.. అన్నీ వేసి కలియ తిప్పి ఉడికించాలి. దగ్గరపడిన తర్వాత కొత్తిమీర తరుగు వేయాలి. దించే ముందు కాస్త నిమ్మరసం కూడా వేస్తే సరిపోతుంది. ఈ ములక్కాడల ఆవకూర రుచిగానూ ఉంటుంది, ఆరోగ్యానికీ మంచిది. ముఖ్యంగా మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి. నచ్చితే.. మీరూ ఒకసారి చేసి చూడండి!

సి.లక్ష్మి, చెన్నై


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని