వహ్వా.. ఠేకువా

తరతరాలుగా వస్తున్న ప్రత్యేక వంటలను బిహార్‌లో రుచి చూడొచ్చు. వాటిల్లో ఠేకువా చాలా ప్రసిద్ధం. దీన్నెలా చేయాలంటే.. ముందుగా పంచదార పాకం పట్టి, చల్లారిన తర్వాత అందులో నెయ్యి వేయాలి.

Published : 12 Nov 2023 01:03 IST

తరతరాలుగా వస్తున్న ప్రత్యేక వంటలను బిహార్‌లో రుచి చూడొచ్చు. వాటిల్లో ఠేకువా చాలా ప్రసిద్ధం. దీన్నెలా చేయాలంటే.. ముందుగా పంచదార పాకం పట్టి, చల్లారిన తర్వాత అందులో నెయ్యి వేయాలి. గోధుమ పిండిలో కొన్ని నీళ్లు, నెయ్యి, బాదం, పిస్తా, జీడిపప్పులు, ఎండు కొబ్బరి పొడి, సోంపు, యాలకుల పొడి వేసి కలపాలి. ఇందులో పంచదార సిరప్‌ను కొద్దికొద్దిగా వేస్తూ మొత్తం కలిసేలా చేయాలి. పిండి మరీ మెత్తగా కాకూడదు. ఇప్పుడు  పిండిని చిన్న ఉండలుగా తీసుకుని.. చేత్తో ఒత్తుతూ గుండ్రంగా లేదా చతురస్రంలా చేసుకోవాలి. లేదంటే కుకీ మౌల్డ్‌తో నచ్చిన ఆకృతిలోకి మలచుకోవచ్చు. కడాయిలో నూనె కాగనిచ్చి.. వీటిని బంగారు రంగు వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది. బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉంటాయి. ఠేకువాలు మరింత రుచిగా ఉండాలంటే.. కుంకుమ పువ్వు పాలు జతచేయాలి, నెయ్యి కొంచెం ఎక్కువేయాలి. చల్లారిన వాటిని గాలి చొరబడని డబ్బాలో ఉంచితే మూడు వారాలు నిలవుంటాయి. పంచదార ఆరోగ్యానికి మంచిది కాదనుకుంటే.. దానికి బదులు బెల్లం వాడొచ్చు. గోధుమ పిండి, నెయ్యి రెండూ మేలు చేసేవే. ఇలాంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ ఆకలిని నివారిస్తాయి. త్వరగా ఆకలేయదు, ఎక్కువ ఆహారం తినాల్సిన అవసరం ఉండదు కనుక.. ఊబకాయం రాదు. ఇవి శక్తినిస్తాయి. జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గుండెకు మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు