గోబీ ఎంత మంచిదో!

బోన్సాయ్‌ చెట్టులా అందంగా ఉంటుంది కదూ క్యాలీఫ్లవర్‌. ఇది రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం. బంగాళదుంప, టొమాటో, బీన్స్‌, క్యారెట్‌, బఠాణీ.. ఇలా దేనితో కలిపి వండినా.. మహా రుచిగా ఉంటుంది. ఏదీ జత చేయకుండా తాలింపు వేసి.. వేయించినా సూపర్‌గా ఉంటుంది

Published : 12 Nov 2023 01:05 IST

బోన్సాయ్‌ చెట్టులా అందంగా ఉంటుంది కదూ క్యాలీఫ్లవర్‌. ఇది రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం. బంగాళదుంప, టొమాటో, బీన్స్‌, క్యారెట్‌, బఠాణీ.. ఇలా దేనితో కలిపి వండినా.. మహా రుచిగా ఉంటుంది. ఏదీ జత చేయకుండా తాలింపు వేసి.. వేయించినా సూపర్‌గా ఉంటుంది. దీంతో చేసే ఊరగాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఫ్రైడ్‌ రైస్‌, బిర్యానీలకు స్పెషల్‌ టేస్ట్‌ తెప్పిస్తుంది. క్యాలీఫ్లవర్‌ పకోడీలూ అంతే.. అందరికీ నచ్చేస్తాయి. ఇంత నోరూరించే క్యాలీఫ్లవర్‌లో ప్రొటీన్లు, విటమిన్లు, క్యాల్షియం, ఐరన్‌, సోడియం, పొటాషియం, ఫొలేట్‌, భాస్వరం, మాంగనీస్‌- ఇలా మన శరీరానికి అవసరమైనవెన్నో ఉన్నాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్‌ అనారోగ్యాలను తరిమికొడితే.. ఇ-విటమిన్‌ కళ్ల కింది వలయాలను పోగొడుతుంది. ఇది మధుమేహాన్ని, క్యాన్సర్లను నిరోధిస్తుంది. అల్సర్లు, గ్యాస్ట్రిక్‌ సమస్యలను తగ్గిస్తుంది. ఊబకాయం రానివ్వదు. రక్తనాళాలు బిరుసెక్కడం, రక్తపోటు లాంటి సమస్యలను నివారిస్తుంది. ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంచుతుంది. చర్మం ముడతలు పడకుండా నిగారింపుతో ఉండేట్లు చేస్తుంది. రక్తం ఐరన్‌ను గ్రహించడంలో తోడ్పడుతుంది. క్యాలీఫ్లవర్‌ తినడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. హిమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది. జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తికి, నరాల వ్యవస్థకు కీలకమైన కోలిన్‌ ఇందులో విస్తారంగా ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని