ఈ కలాకండ్‌ మహా రుచి!

పాలను బాగా బాగా మరిగించి చేసే కలాకండ్‌ను ఇష్టపడని వాళ్లు దాదాపుగా ఉండరు.

Updated : 26 Nov 2023 03:32 IST

పాలను బాగా బాగా మరిగించి చేసే కలాకండ్‌ను ఇష్టపడని వాళ్లు దాదాపుగా ఉండరు. నేను సాధారణ కలాకండ్‌తో పాటు.. ఈ కాలంలో దొరికే సీతాఫలాలతో సూపర్‌ అనిపించే కలాకండ్‌ చేస్తుంటా. మా వాళ్లంతా చాలా బాగుందన్నారు. దీన్నెలా చేయాలంటే.. ముందుగా సీతాఫలాల గుజ్జు తీసి.. రెండు గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి. పాలను 2 భాగాలుగా చేయాలి. ఒక గిన్నెలో పాలను సగమయ్యేదాకా మరిగించాలి. రెండో దాంట్లో పొంగు వచ్చాక నిమ్మరసం వేయాలి. విరిగిన పాలను శుభ్రమైన పల్చని వస్త్రంలో వడకట్టి పనీర్‌ తయారు చేయాలి. దీన్ని మొదటి పాత్రలో మరిగిన పాలకు జోడించి.. పంచదార, యాలకుల పొడి వేయాలి. నాలుగైదు నిమిషాల తర్వాత దించేయాలి. చల్లారాక సీతాఫలం గుజ్జు కలపాలి. ఒక ప్లేటులో నెయ్యి రాసి.. ఈ మిశ్రమాన్ని సమంగా సర్ది.. పిస్తా పలుకులు చల్లాలి. కాసేపటికి గట్టిపడుతుంది. దాన్ని ముక్కలుగా కట్‌చేస్తే సరి.. సీతాఫల్‌ కలాకండ్‌ సిద్ధం. నచ్చిన ఫుడ్‌ కలర్‌ వేస్తే.. మరింత అందంగా కనిపిస్తుంది. ఇది ఫ్రిజ్‌లో పెడితే.. మూడు రోజులు నిలవుంటుంది. నచ్చితే మీరూ ప్రయత్నించండి.

 పొత్తూరి మాధురి అన్నపూర్ణ, ఏజీ కాలనీ, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని