కనికా.. తియ్యటి బిర్యానీ

ఒడిశా ప్రసిద్ధ వంటల్లో ‘కనికా స్వీట్‌’ ఒకటి. దీన్నే ‘స్వీట్‌ పులావ్‌’ అని కూడా అంటారు. ఎలా చేయాలంటే ఓ కప్పు బాస్మతి బియ్యాన్ని అరగంట సేపు నానబెట్టి, వడకట్టి పక్కనుంచుకోవాలి.

Published : 31 Dec 2023 00:24 IST

డిశా ప్రసిద్ధ వంటల్లో ‘కనికా స్వీట్‌’ ఒకటి. దీన్నే ‘స్వీట్‌ పులావ్‌’ అని కూడా అంటారు. ఎలా చేయాలంటే ఓ కప్పు బాస్మతి బియ్యాన్ని అరగంట సేపు నానబెట్టి, వడకట్టి పక్కనుంచుకోవాలి. కడాయిలో రెండు టేబుల్‌స్పూన్ల నేతిలో.. చారెడు జీడిపప్పు, పిస్తా, కిస్మిస్‌లను వేయించి, పక్కకు తీయాలి. అదే కడాయిలో బిర్యానీ ఆకులు 2, యాలకులు 5, లవంగాలు 4, స్టార్‌ మొగ్గలు 2, అంగుళం దాల్చిన చెక్క ముక్క, ఒక చెంచా మిరియాలు, చారెడు ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించాలి. దానికి నానబెట్టిన బియ్యం జత చేసి.. కొద్దిసేపు వేయించాలి. అందులో పసుపు, తగినంత ఉప్పు, నాలుగు టేబుల్‌ స్పూన్ల పంచదార, జీడిపప్పు, పిస్తా, కిస్మిస్‌లు, ఇంకో చెంచా నెయ్యి వేసి కలియ తిప్పాలి. రెండు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి, సన్నసెగ మీద ఉడికించాలి. అంతే ఘుమఘుమలాడే తియ్యటి కనికా లేదా స్వీట్‌ పులావ్‌ సిద్ధమైపోతుంది. మరీ తీపి, మరీ కారం కాకుండా మధ్యస్తమైన రుచి కోరుకునేవారికి ఇది చాలా నచ్చుతుంది. ముఖ్యంగా చలికాలం నోటికి హితవుగా ఉంటుంది. జలుబును నిరోధిస్తుంది. ఈ ఒడిశా వంటకాన్ని ఇతర రాష్ట్రాల వారు కూడా ఇష్టంగా తింటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని