పనీర్‌ చమన్‌.. రుచీ బలం

ఒక్కో ప్రాంతానికి ఒక్కో సంస్కృతి ఉన్నట్టే.. వంటల్లోనూ ఎవరి ప్రత్యేకతలు వారికున్నాయి. కశ్మీర్‌ వాసుల సంప్రదాయక వంటకం కశ్మీరీ పనీర్‌ చమన్‌. ఆకర్షణీయంగా ఉండే కశ్మీర్‌ ఆపిల్‌ పండ్లు చూస్తే.. ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుందో.. ఈ వంటకం కూడా అలాగే నోరూరిస్తుంది.

Published : 07 Jan 2024 00:54 IST

క్కో ప్రాంతానికి ఒక్కో సంస్కృతి ఉన్నట్టే.. వంటల్లోనూ ఎవరి ప్రత్యేకతలు వారికున్నాయి. కశ్మీర్‌ వాసుల సంప్రదాయక వంటకం కశ్మీరీ పనీర్‌ చమన్‌. ఆకర్షణీయంగా ఉండే కశ్మీర్‌ ఆపిల్‌ పండ్లు చూస్తే.. ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుందో.. ఈ వంటకం కూడా అలాగే నోరూరిస్తుంది. ఇంతకీ దీన్నెలా చేస్తారంటే.. పనీర్‌ను చిన్న ముక్కలుగా కోసి.. ఒక పాత్రలో వేయాలి. కప్పు పాలల్లో చిటికెడు కుంకుమ పువ్వు వేసి, వేడిచేయాలి. లేత పసుపు రంగులోకి మారాక.. ఆ పాలను పనీర్‌ ఉన్న పాత్రలో పోయాలి. వాటినలా పక్కనుంచి.. కడాయిలో చెంచా నూనె వేసి.. రెండు బిర్యానీ ఆకులు, నాలుగు యాలకులు, ఐదు లవంగాలు, కొంచెం పుదీనా, ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి వేయించాలి. అవి వేగాక కప్పు పాలు పోసి.. మూడు నిమిషాలు మరిగించాలి. ఇందులో పనీర్‌ ముక్కలున్న పాలను జతచేసి.. మధ్య మధ్యలో కలియ తిప్పుతూ మరిగించాలి. చిక్కబడ్డాక తగినంత ఉప్పు వేసి దించేస్తే సరిపోతుంది. పాలూ, పనీర్‌, మసాలా కలిసిన ఈ కశ్మీరీ పనీర్‌ చమన్‌ ప్రత్యేక రుచితో ఆకట్టుకుంటుంది. ఇది బలాన్నిచ్చే మంచి పోషకాహారం కూడా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని