ఫిష్‌ 65 తినేద్దామా...

చేప- పావుకేజీ (మూడు అంగుళాల మందంతో ముక్కలు కోయాలి), పసుపు- పావు టీస్పూన్‌, కారం, అల్లంవెల్లుల్లి పేస్టు- టీస్పూన్‌ చొప్పున, గుడ్డు- ఒకటి, మైదా, మొక్కజొన్న పిండి- టేబుల్‌స్పూన్‌ చొప్పున, చిల్లీపేస్ట్‌- టీస్పూన్‌, సోయాసాస్‌, ధనియాల పొడి- టీస్పూన్‌

Updated : 21 Mar 2021 06:35 IST

పాఠక వంట

కావాల్సినవి: చేప- పావుకేజీ (మూడు అంగుళాల మందంతో ముక్కలు కోయాలి), పసుపు- పావు టీస్పూన్‌, కారం, అల్లంవెల్లుల్లి పేస్టు- టీస్పూన్‌ చొప్పున, గుడ్డు- ఒకటి, మైదా, మొక్కజొన్న పిండి- టేబుల్‌స్పూన్‌ చొప్పున, చిల్లీపేస్ట్‌- టీస్పూన్‌, సోయాసాస్‌, ధనియాల పొడి- టీస్పూన్‌ చొప్పున, ఉప్పు- తగినంత, మిరియాల పొడి- అర టీస్పూన్‌, నిమ్మరసం- టేబుల్‌స్పూన్‌.  
తయారీ: చేప ముక్కలను శుభ్రంగా కడిగి ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, మిరియాల పొడి, చిల్లీపేస్ట్‌, నిమ్మరసం, సోయాసాస్‌ పట్టించాలి. వీటిని ఇరవై నిమిషాలపాటు నానబెట్టాలి. తర్వాత దీంట్లో గుడ్డు, మొక్కజొన్న పిండి, మైదా వేసి  ముక్కలకు బాగా పట్టించాలి. కడాయిలో నూనె వేడిచేసి మధ్యస్థంగా ఉండే మంట మీద వేయించాలి. వీటిని వేడివేడిగా టొమాటో, చిల్లీసాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని